Ammayi garu Serial Today july 23rd: అమ్మాయి గారు సీరియల్: ప్లాన్‌బీగా విషప్రయోగం.. రాఘవని కనిపెట్టేసిన ఆనంద్.. ఏం జరగనుంది?
Ammayi garu Serial Today Episode july 23rd ఆనంద్ రాఘవని రౌడీల నుంచి తప్పించి రాజు, రూపల దగ్గరకు తీసుకురావడానికి బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబికకు రుక్మిణి బోనాల పొయ్యిలు వెలిగించమని అంటుంది. విజయాంబిక కొడుకుతో కలిసి ఆ పొయ్యిల మీద మండే గుణం ఉన్న పొడి వేయడంతో పొయ్యి వెలిగించడానికి భయపడుతుంది. అందరూ చెప్పడంతో విజయాంబిక ఇక వేరే దారి లేదు దొరికిపోయా అనుకుంటూ పొయ్యి వెలిగిస్తుంది. పొయ్యి నుంచి ఒక్క సారిగా మంటలు వచ్చేస్తాయి.
విజయాంబిక కళ్ల మంట అని కేకలు పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. విరూపాక్షి అందరితో ఎందుకిలా జరిగింది అశుభం ఏమైనా జరుగుతుందా అమ్మవారు ఇలా హెచ్చరిస్తుందా అని అంటుంది. దానికి రాజు కర్రల మీద మండే స్వభావం ఉన్న పొడి ఏదైనా పడుంటుందని అంటాడు. ఇక సూర్యప్రతాప్ రుక్మిణితో పొయ్యి వెలిగించమ్మా త్వరగా ప్రసాదం వండండి అని అంటుంది. దానికి రుక్మిణి నాయనా అత్తకి అయింది చూస్తే భయంగా ఉంది అందుకే దీపక్ బావని వెలిగించమని చెప్పండి బావకి ధైర్యం ఎక్కువ కదా అని అంటుంది.
సూర్యప్రతాప్ దీపక్‌కి పొయ్యి వెలిగించమని అంటాడు. తప్పదని దీపక్ వెళ్తాడు. దీపక్ భయంతో వెలిగిస్తాడు. ఆ పొయ్యి నుంచి కూడా మంటలు వచ్చి దీపక్ విలవిల్లాడిపోతాడు. విజయాంబిక దీపక్ కళ్లు కడుగుతుంది. రూప రాజుతో ఇదంతా వీళ్ల పనే అని అంటుంది. రాజు కట్టెలు చూసి వాటి మీద పొడి చూసి కట్టెల్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది మీరు వెళ్లండి నేను వేరే కట్టెలు రెడీ చేస్తా అని చెప్తాడు. సూర్యప్రతాప్ జాగ్రత్త చెప్పి వెళ్లిపోతాడు. దీపక్, విజయాంబికలు కళ్లు మంట అని బయటకు వెళ్లిపోతారు. బంటీ వీడియో తీస్తూ కళ్లు మండు తున్నాయి అన్నారు నాకు ఏమైనా సాయం చేయమంటారా అని అంటాడు. విజయాంబిక దీపక్‌తో కొంప తీసి వీడు మన ప్లాన్‌ని వీడియో తీసి రూపకి చూపించాడా అని అంటుంది.
రాజు వేరే చోట పొయ్యిలు ఏర్పాటు చేయిస్తాడు. రూప, విరూపాక్షి, మందారం, సుమలు ప్రసాదం వండుతారు. మరోవైపు ఆనంద్ ఆ రౌడీని ఫాలో అవుతుంటాడు. రూప రాజుతో అమ్మ కళ్లు పొగొట్టాలని చూశారు వీళ్లని ఎలా అయినా ఇంటి నుంచి శాశ్వతంగా గెంటేయాలి అని అంటుంది. రాఘవ దొరికిన వెంటనే చేద్దామని రాజు అంటాడు. రౌడీని ఫాలో అయిన ఆనంద్ రాఘవని చూస్తాడు. ఎలా అయినా తన తండ్రిని పెద్దయ్యా గారి ముందు నిలబెట్టాలని అనుకుంటాడు. మరోవైపు బంటీ అందర్నీ వీడియో తీస్తూ తెగ మురిసిపోతాడు. అందరూ సంతోషంగా ఉండటం చూసి విజయాంబిక, దీపక్‌లు రగిలిపోతారు. దీపక్ తల్లితో ప్లాన్ బీ ఉందని అత్యంత ప్రమాదకరమైన పాము విషం తెప్పిస్తున్నానని ఆ విషం ప్రసాదంలో కలిపి ఇచ్చేద్దామని ఎవరైనా అడిగితే పాము కాటేసి చనిపోయారని చెప్దామని అంటాడు.
రాఘవ దగ్గరకు ఆనంద్ వెళ్తాడు. రాఘవ రౌడీ తల మీద కొట్టి రాఘవని విడిపిస్తాడు. నువ్వు ద్రోహిగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు.. అమ్మగారు నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు పద నాన్నా పెద్దయ్యగారికి నిజం చెప్దాం అని రౌడీలను కొట్టి రాఘవని తీసుకొని బయల్దేరుతారు. ఆ టైంలో రాఘవ ఫోన్ పడిపోతుంది. ఇక దీపక్‌కి ఒకాయన విషం తీసుకొచ్చి ఇస్తారు. రాఘవని తీసుకొని ఆనంద్ పరుగున వస్తుంటారు. రూప, రాజులు రాఘవ వాళ్ల గురించి మట్లాడుకోవడం ఆనంద్ వీడియో తీస్తాడు. బంటీ ఆ వీడియో సూర్యప్రతాప్‌కి చూపించడానికి వెళ్తాడు. ఆ వీడియో చూస్తే ప్రమాదం దొరికిపోతాం అని రాజు, రూపలు తెగ టెన్షన్ పడతారు. సూర్య ప్రతాప్ చూస్తుంటే ఇంతలో పంతులు పిలుస్తారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: లోహిత భర్త్‌డే పార్టీని నాశనం చేసిన మధు.. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అంటూ నడిరోడ్డు మీద రచ్చ!





















