Ammayi garu Serial Today july 21st: అమ్మాయి గారు సీరియల్: సూర్య క్షమాపణలు.. రూప, రాజులకు విజయాంబిక సపోర్ట్.. పెద్ద ప్లానే!
Ammayi garu Today Episode సూర్యప్రతాప్ రుక్మిణి, విరూపాక్షిలను అవమానించినందుకు బాధ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ఐలమ్మ భర్త వచ్చి రాజు చెప్పినట్లు చెప్పడంతో దీపక్ తప్పు చేశాడని సూర్యప్రతాప్ దీపక్‌ని తిడతాడు. ఇంటి నుంచి వెళ్లగొట్టకుండా విజయాంబిక ఆపుతుంది. విరూపాక్షి, రాజు, రుక్మిణిలను సూర్యప్రతాప్ ఇంటికి రమ్మని చెప్తాడు. రూప అత్తతో దేవుడు మంచి వాళ్ల వైపే ఉంటాడు. మా అమ్మానాన్నల్ని కలిపే వరకు మేం ఊరుకోం. మాకు అండగా ఆ దేవుడు ఉన్నాడని అంటుంది.
విజయాంబిక రగిలిపోతుంది. దీపక్‌తో బంగారం లాంటి అవకాశం చేజారిపోయిందని అంటుంది. ఏదైనా ప్లాన్ చేసే ముందు ముందు వెనకా ఆలోచించి చేయాలని అంటుంది. ఇంకొన్ని రోజులు ఏం ప్లాన్స్ చేయకుండా అందరూ ఈ విషయం మర్చిపోయే వరకు సైలెంట్‌గా ఉండటం మంచిది అని అంటుంది.
రుక్మిణి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి భోజనానికి పిలుస్తుంది. సూర్యప్రతాప్ రుక్మిణిని చూసి తను అవమానించింది అంతా గుర్తు చేసుకుంటాడు. రుక్మిణి తండ్రి చేయి పట్టుకొని తీసుకెళ్లబోతే సూర్యప్రతాప్ కన్నీరు పెట్టుకుంటాడు. నాయనా ఏమైంది ఆ కన్నీరు ఏంటి అని రుక్మిణి అడుగుతుంది. సూర్యప్రతాప్ కూతురి చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు. ఏంటి నాయనా నువ్వు అని రుక్మిణి అడిగితే లేదమ్మా నేను తప్పు చేశాను నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటిచేశాను నన్ను క్షమించు అని అంటాడు. ఇలా మాట్లాడకు నాయనా నాకు కష్టంగా ఉందని అంటే లేదమ్మా నాకు పొద్దున్నుంచి నా ముఖం నాకు చూపించాలి అన్నా నీతో మాట్లాడాలి అన్నా ఇంట్లో ఎవరికైనా ఎదురు పడాలి అన్నా నావల్ల కావడం లేదని అంటారు. దానికి రుక్మిణి అంత తప్పు నువ్వేం చేశావు నాయనా అంటుంది. తండ్రిని ఒప్పించి భోజనానికి తీసుకెళ్తుంది.
రుక్మిణి తండ్రికి అందరితో పాటు భోజనానికి కూర్చొపెడుతుంది. విరూపాక్షిని చూసి సూర్యప్రతాప్ వాళ్లని గెంటించేయండి గుర్తు చేసుకొని బాధ పడతాడు. విరూపాక్షిని చూస్తూ తినకుండా ఉంటాడు. రాజు, రుక్మిణిలు తినమని చెప్తారు. సూర్యప్రతాప్ భోజనం చేస్తాడు. విరూపాక్షి సుమకి సైగ చేస్తుంది. విజయాంబిక చూసి ఏంటి సైగ చేస్తుంది ఇక్కడ ఏదో జరగబోతుంది అనుకుంటుంది. ఇక సుమ సూర్యప్రతాప్‌తో బావగారు మన రూప ఉండి ఉంటుంటే ప్రతీ ఏడాదిలా ఈ ఏడాది కూడా బోనం సమర్పించే వాళ్లం ఈ సారి రూప స్థానంలో ఉన్న రుక్మిణితో బోనం ఎత్తిద్దామని చంద్ర, సుమ చెప్తారు. విజయాంబిక కూడా రుక్మిణికి సపోర్ట్ చేసి రాజు, రుక్మిణిలకు పెళ్లి అయిన సందర్భంగా బోనం ఎత్తిద్దామని అంటుంది. సూర్యప్రతాప్ అందరూ చెప్పడంతో ఒకే చెప్తాడు.
రాజు, రూప, విరూపాక్షిలు విజయాంబిక ఇలావాళ్లకి సపోర్ట్ చేయడంతో ఏదో ప్లాన్ చేస్తుందని అనుకుంటారు. దీపక్ తల్లితో నువ్వు మారిపోయావా మమ్మీ అంటే అవునురా నేను మారిపోయా నువ్వు మారిపో అని మంచి వాళ్లగా నటించు అని అంటుంది. ఇంట్లో వేసిన ప్లాన్స్ బెడిసి కొట్టడం వల్ల బయట ప్లాన్ చేద్దామని మీ మామయ్యతో పాటు ఎవరు దొరికితే వాళ్లని టార్గెట్ చేద్దామని ప్లాన్ చెప్తుంది. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని అంటుంది. విరూపాక్షి గ్యాంగ్ విజయాంబిక గురించి ఆలోచిస్తుంటారు. ఉదయం బంటీ తాతయ్యలా రెడీ అవుతాడు. సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తాడు. నిన్ను చూస్తే చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉంది బంటీ అని సూర్యప్రతాప్ అంటాడు.
సూర్యప్రతాప్ మనసులో రూప స్థానంలోకి రుక్మిణి వచ్చింది ఎంత వరకు బంటీకి న్యాయం చేస్తుందో అని అనుకుంటాడు. బంటీ అమ్మమ్మ దగ్గరకు వెళ్లి తాతలా మాట్లాడుతాడు. అచ్చం మీ తాతయ్యలా మాట్లాడుతున్నావ్ అని అంటుంది. ఇక బంటి మెట్ల మీద ఉంటే సూర్యప్రతాప్, విరూపాక్షి చెరోవైపు నుంచి వస్తారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకొని ఆగిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















