Ammayi garu Serial Today july 18th: అమ్మాయి గారు సీరియల్: రూప, విరూపాక్షి, రాజులను గెంటేసిన సూర్య.. దీపక్ కాళ్లు ఎందుకు పట్టుకున్నట్లు?
Ammayi garu Today Episode దీపక్ చూపించిన సాక్ష్యంతో సూర్యప్రతాప్ రూప, విరూపాక్షి, రాజులను ఇంటి నుంచి గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ ఐలమ్మని ఇంటికి తీసుకొస్తాడు. రూప, రుక్మిణి ఒక్కరే అని ఐలమ్మ దంపతులు రూపని కాపాడారని సూర్యప్రతాప్‌కి చెప్తారు. విజయాంబిక తల్లీకూతుళ్లని తిడుతుంది. నా తమ్ముడిని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని అడుగుతుంది. పాతికేళ్ల క్రితం నా తమ్ముడిని మోసం చేశావ్ కదా విరూపాక్షి ఇప్పుడు మళ్లీ ఆడుకోవాలి అనుకుంటున్నావా అని తిడుతుంది. నా తమ్ముడి ప్రాణం తీయాలి అని ప్లాన్ చేశారా అని అడుగుతుంది.
రుక్మిణి కన్నీరు పెట్టుకుంటుంది. యాస మార్చి యాక్టింగ్ చేయడం లేదు ఏంటి రూప అని అడుగుతుంది. సూర్యప్రతాప్ ఏం అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. విజయాంబిక కోపంగా పుట్టుక సరైంది అయితే బుద్ధులు మంచివి వస్తాయి అంటుంది. రాజు కోపంగా విజయాంబిక గారు అని అనగానే నీ దగ్గరకే వస్తున్నా తమ్ముడు హనుమంతుడిలా లాంటోడు అనుకున్న వీడే నీకే వెన్ను పోటు పొడిచాడు. వాళ్లతో చేతులు కలిపి అంతా నడిపిస్తున్నాడు అని అంటుంది.
సూర్యప్రతాప్ రూపతో రుక్మిణితో ఏంటమ్మా ఇదంతా నువ్వు వీళ్లతో కలిసి నాటకం ఆడుతున్నావా అని అడుగుతాడు. రాజు ఆ మాటలు నమ్మొద్దని చెప్తాడు. ఇంతలో దీపక్ విరూపాక్షి ఐలమ్మకి డబ్బులు ఇస్తున్న వీడియో చూపిస్తాడు. అది చూసి సూర్యప్రతాప్ విరూపాక్షిని కోపంగా చూస్తాడు. భార్య, కూతురి దగ్గరకు వెళ్లి కోపంగా చూసి నాన్న అంటే నువ్వు అన్నావ్.. నాన్న అంటే పంచప్రాణాలు అన్నావ్ నేను చూస్తుంది అప్పటి నుంచి నువ్వు చేస్తుంది నటనేనా.. నా రక్తం పంచుకుపుట్టిన నీలో ఈ కల్తీ రక్తం కూడా ఉందని మర్చిపోయాను. అప్పుడు ఈ తప్పుడు మనిషి చేసిన తప్పు ఇప్పుడు నువ్వు నిజం దాయడం నాదృష్టిలో రెండు ఒక్కటే అని కేకలేస్తాడు. రూప, విరూపాక్షితో పాటు అందరూ షాక్ అయిపోతారు.
సూర్యప్రతాప్ విజయాంబికతో అక్క వీళ్లు ఇంకా నా ఇంట్లో ఉండటానికి వీళ్లేదు మెడపట్టుకొని గెంటేయ్ అంటాడు. విజయాంబిక ఇద్దరి మెడ పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లి తోసేస్తుంది. దీపక్ రాజు కాలర్ పట్టుకొని రాజుని గెంటేస్తాడు. అమ్మా అని బంటి వెళ్తుంటే సూర్యప్రతాప్ ఆపి నువ్వు ఇలాంటి మోసగాళ్ల దగ్గర పెరిగితే నువ్వు అలానే తయారవుతావు నిన్ను నేను చూసుకుంటా అంటాడు. ఇంకెప్పుడూ మీ ముఖం నాకు చూపించకండి అని లోపలికి వెళ్లకపోతుంటే ఐలమ్మ భర్త వచ్చి పెద్దయ్య గారు ఘోరం జరిగిపోయింది అని దీపక్ తన ఇంటికి వచ్చి ఏదో చెప్పమని బేరం ఆడాడని వద్దని చెప్పినా వినకుండా మా ఆవిడను కారు ఎక్కించుకొని వచ్చాడని అంటాడు.
దీపక్ ఆయనతో నేను అలా చెప్పడం ఏంటి ఆవిడకు తెలిసిన విషయం చెప్పమన్నా అంటాడు. ఆయన సూర్యప్రతాప్ దగ్గరకు పరుగులు తీసి ఈ సార్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అయ్యా.. అసలేం జరిగింది అంటే మా బిడ్డకు ఒంట్లో బాలేదని ఎమ్మెల్యే గారికి డబ్బు సాయం అడిగాం ఆవిడ ఇచ్చింది సార్ అంతకు మించి ఇంకేం లేదు అని అంటాడు. రూప, విరూపాక్షిలు కూడా అతను అలా చెప్పడంతో షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్‌లో రాజు విరూపాక్షికి కాల్ చేసి ఐలమ్మ భర్త నెంబరు అడుగుతాడు. అతనికి కాల్ చేసి ప్లాన్ మొత్తం చెప్తాడు. ఐలమ్మ భర్త ఐలమ్మతో జరిగింది చెప్పు అని కన్నుకొడతాడు. దాంతో ఆమె భర్తకి సపోర్ట్ చేసి దీపక్ చెప్పమని చెప్పినట్లు చెప్పానని క్షమించమని అడుగుతుంది. దీపక్ సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి వాళ్లు అబద్ధం చెప్తున్నారు అని అంటాడు. ఇక దీపక్ ఐలమ్మకి డబ్బు ఇస్తున్నట్లు తీసిన వీడియో చూపిస్తాడు.
సూర్యప్రతాప్ దీపక్‌ని తిడతాడు. నీకు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా నీ బుద్ధి మారదురా అని అంటాడు. విజయాంబిక కొడుకుని కొడుతుంది. క్షమాపణ అడగమని సూర్యప్రతాప్ దగ్గరకు పంపిస్తుంది. సూర్యప్రతాప్ దీపక్‌ని తన్నేస్తాడు. నువ్వొక చీడపురుగువని నీలాంటి వాడు ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని ఇంటి నుంచి గెంటేస్తానని అంటే విజయాంబిక ఆపి విరూపాక్షిని క్షమించమని అడగమని పంపిస్తుంది. దీపక్ విరూపాక్షి కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. రుక్మిణి కాళ్లు కూడా పట్టుకుంటాడు. ఈ ఒక్కసారికి క్షమించమని విజయాంబిక సూర్యప్రతాప్‌ని అడుగుతుంది. చంద్రతో సూర్యప్రతాప్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయించమని రుక్మిణి వాళ్లని లోపలికి రమ్మని చెప్పమని అంటాడు. బంటీ కోపంగా వెళ్లి దీపక్ పొట్ట మీద పంచ్ ఇస్తాడు. హ్యాపీగా బయటకు వెళ్లాలి అనుకున్నాం నీ వల్ల అంతా పోయింది అని అంటాడు. రూపని హగ్ చేసుకుంటాడు. ఇక ఐలమ్మని తన భర్త ఎవరు ఏం చెప్తే అది చేసేస్తావా అమ్మగారికి చెప్పే పని లేదా అని తిడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!





















