Ammayi garu Serial Today july 17th: అమ్మాయి గారు సీరియల్: రూప, రుక్మిణి ఒక్కరేనని ఐలమ్మతో సూర్యకి చెప్పించేసిన దీపక్..!
Ammayi garu Today Episode దీపక్ ఐలమ్మని ఇంటికి తీసుకొచ్చి రూప, రుక్మిణి ఒక్కరే అని సూర్యప్రతాప్‌తో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి రూపని కాపాడిన ఐలమ్మని కలుస్తుంది. దీపక్ అదంతా వీడియో తీస్తాడు. తల్లికి కాల్ చేసి విషయం చెప్పి ఐలమ్మని తీసుకొస్తానని అంటాడు. విజయాంబిక విరూపాక్షి ఇరుక్కుపోయిందని అనుకుంటుంది. విరూపాక్షి ఇంటికి రావడం చూసి దీపక్ రూపని కాపాడిన మనిషిని తీసుకొస్తాడు నా తమ్ముడి దగ్గర నువ్వు అయిపోతావ్ విరూపాక్షి అని అనుకుంటుంది.
రుక్మిణి, రాజులు బంటీని తీసుకొని బయటకు వెళ్లడానికి రెడీ అవుతారు. విరూపాక్షి వాళ్ల దగ్గరకు వచ్చి బంటి ఇప్పటి వరకు ఎప్పుడూ బయటకు వెళ్లలేదు చాలా సంతోషపడతాడు అని అంటుంది. ఇంతలో అక్కడికి విరూపాక్షి వచ్చి ఈ రోజు బంటీ కోరిక నెరవేరబోతుంది విరూపాక్షి అని అంటుంది. దగ్గరకు వచ్చి మరి కాసేపట్లో మీరు ఆడుతున్న రుక్మిణి వేరు రూప వేరు అనే నాటకానికి తెర పడిపోతుంది. రుక్మిణి, రూప ఒక్కరే అని తెలిసిపోతుందని అంటుంది. ఇక దీపక్ ఐలమ్మ దగ్గరకి వెళ్లి విరూపాక్షి డబ్బు ఇచ్చిందని చెప్పి ఇస్తాడు. ఆవిడ వద్దు అంటే తాను విరూపాక్షి పీఏ అని చెప్పి ఇస్తాడు. మీకు విరూపాక్షి అంటే అంత గౌరవం ఏంటో ఎమ్మెల్యే అయి మీ కోసం పరుగులు వచ్చారని అంటాడు. దాంతో తమ కూతుర్ని కాపాడటం వల్ల అలా మమల్ని అభిమానిస్తున్నారని అంటుంది.
దీపక్ ఐలమ్మతో సీఎం గారికి ఆయన కూతురు అంటే ప్రాణం మీరు ఆమెను కాపాడారు అని తెలిస్తే చాలా సంతోషిస్తారు. అవసరం అయితే మీకు ఆస్తి కూడా ఇస్తారు అని చెప్పి ఐలమ్మని తీసుకెళ్తాడు దీపక్. అదంతా ఐలమ్మ భర్త చూసి దీపక్ బాబు విరూపాక్షి గారి మేనల్లుడు అయి పీఏ అంటాడు ఏంటి అని వాళ్లని ఆపాలని చూస్తాడు. తర్వాత విరూపాక్షికి కాల్ చేసి మీ మేనల్లుడు నా భార్యని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడని జరిగింది అంతా చెప్తాడు. రాజు వాళ్లకి విషయం తెలియడంతో రాజు ఎలా అయినా దీపక్‌ని ఆపాలని పరుగులు తీస్తాడు. దీపక్ విజయాంబికకు కాల్ చేసి పది నిమిషాలు మామయ్య ఎక్కడికీ వెళ్లకుండా ఆపు అని అంటాడు.
సూర్యప్రతాప్ బయటకు వెళ్తుంటే విజయాంబిక రాహు కాలం అని పది నిమిషాలు అని ఆగమని అంటుంది. చంద్ర అన్నయ్యతో మనం ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం కదా కాసేపు ఆగుదాం అని అంటాడు. మరోవైపు రాజు దీపక్‌ని ఆపాలని రోడ్డుకి అడ్డంగా వెళ్తాడు. కారు చూసి అడ్డంగా నిల్చొంటాడు. దీపక్ చూసి రాజుని ఎక్కించేసి వెళ్లిపోతా అని ఫాస్ట్‌గా వెళ్తాడు. రాజు పక్కకి తప్పుకుంటాడు. రాజు మళ్లీ దీపక్‌ని ఫాలో అవుతాడు. బంటీ తాత దగ్గరకు వెళ్లి నాన్న ఫోన్ వచ్చి బయటకు వెళ్లారు మీరు కాల్ చేసి రమ్మని చెప్పండి అంటాడు. చంద్ర రాజుకి కాల్ చేస్తాడు. విరూపాక్షి, రూపలు చాలా కంగారు పడతారు. ఇక సూర్యప్రతాప్ టైం అయిందని వెళ్లే టైంకి దీపక్ ఐలమ్మని తీసుకొని వస్తాడు. రూప, విరూపాక్షిలు చాలా కంగారు పడతారు.
దీపక్ ఆవిడను తీసుకొచ్చి మామయ్య మనం రూప చనిపోయింది అనుకున్నాం కదా రూప కోసం ఈవిడ చెప్తారు అని మన రూప కోసం మీకు ఏం తెలుసో చెప్పండి అమ్మా అని దీపక్ అంటాడు. రుక్మిణి, విరూపాక్షి చాలా కంగారు పడతారు. రాజు పరుగున ఇంటికి వస్తాడు. ఐలమ్మ సూర్యప్రతాప్‌తో తాను తన భర్త చెరువు గట్టు మీద బట్టలు ఆరేస్తుంది ఒక అమ్మాయి కొట్టుకొని వస్తే హాస్పిటల్‌లో చేర్పించామని తను మీకు అమ్మగారికి పుట్టిన కూతురు అని చెప్తుంది. సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. మీ కూతుర్ని అమ్మగారికి అప్పగించామని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీపక్ మామయ్యతో వీళ్లు అత్తకి అప్పగించిన అమ్మాయి రుక్మిణి వేషంలో ఉన్న రూప మామయ్య అని అంటాడు. సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. రుక్మిణిని చూపించి ఆ ఆమ్మాయినే మేం కాపాడింది అని చెప్తుంది. రూప పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావ్ నేను నీళ్లలో కొట్టుకురావడం ఏంటి నా పేరు రుక్మిణి అని అంటుంది. విజయాంబిక రూపని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















