Ammayi garu Serial Today January 7th: అమ్మాయి గారు సీరియల్: బంటీ, రూపలకు సీక్రెట్ డీఎన్‌ఏ టెస్ట్.. కిడ్నాప్ ప్లాన్.. నిజం చెప్పేసిన రోహిణి!
Ammayi garu Today Episode రూప, రాజు బిడ్డ బంటీలను డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని జీవన్ వాళ్లు ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode బంటీ హోంవర్క్ చేస్తుంటే విరూపాక్షి దగ్గరకు వెళ్తుంది. బంటీ విరూపాక్షితో నాకు అందరూ ఉన్నారు నీకు ఎవరూ లేరా అమ్మగారు అని అడుగుతాడు. దాంతో ముత్యాలు అలా అడుగుతావేంటి బంటీ మనందరం అమ్మగారికి ఉన్నాం కదా అంటాడు. ఇంతలో అప్పలనాయుడు బేరాలు ఏం లేవు అని ఇంటికి వచ్చేస్తాడు. మరోవైపు దీపక్, విజయాంబిక, జీవన్‌లు రాజు ఇంటికి వచ్చి చూస్తారు. ఆ బాబే రాజు కొడుకు అని జీవన్ చూపిస్తాడు.
విజయాంబిక: తొందర పడకుండా అసలు ఆ బాబు ఎవరు రాజుకి ఆ బాబుకి ఏం సంబంధమో తెలుసుకోవాలి.
బంటీ: తాత మీ అందరితో పాటు మా అమ్మ ఎందుకు లేదు. మా అమ్మ గురించి మాట్లాడితే నాన్న ఎందుకు అంత కోప్పడతాడు. నాన్న వచ్చాడు. నాన్న.
రాజు: హే బంటీ.
విజయాంబిక: వీడు రాజు కొడుకు అన్న సంగతి రూపకి తెలీదు. తెలిస్తే అలా సైలెంట్‌గా ఉండదు.
దీపక్: రాజుకి పెళ్లి కాకుండా బిడ్డ ఎలా మమ్మీ కొంపతీసి రూపకి పుట్టిన బిడ్డా.
విజయాంబిక: లేదు ఆ బిడ్డ ఈ బిడ్డ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకు అంటే రూప గర్భవతి అని తెలిసినా రాజు రాలేదు. రూప డెలివరీ ఎక్కడ ఏంటి అనేది రాజుకు తెలీదు. హాస్పిటల్‌కి రాజు వచ్చే ఛాన్సే లేదు. రోహిణీ అటుగా వెళ్తుంటే విజయాంబిక అడ్డుకుంటుంది.. మమల్ని గుర్తు పట్టావా.
రోహిణి: గుర్తు పట్టాను కానీ మీరేంటి ఇక్కడ.
దీపక్: అసలు రాజు నీకు ఏం అవుతాడు. అందరి ముందు నీ మీద చేయి వేశాడు.
రోహిణి: మీ రూప రాజు జీవితంలోకి రాకపోతే రాజు నాకు కాబోయే భర్త అవుతాడు. కానీ అది జరిగేలా లేదు.
విజయాంబిక: మా రూప రాజు జీవితంలోకి రాదు. వచ్చుంటే ఆ రోజు వాళ్లు కనీసం మాట్లాడుకోలేదు కదా. ఆ రోజు నిన్ను చనువుగా కొట్టాడు కానీ తనతో మాట్లాడలేదు.
దీపక్: అంటే రాజుకి నీ మీదే ఇష్టం ఉన్నట్లు కదా. సరే ఆ బాబు ఎవరు?
రోహిణి: బంటీ రాజు కన్న కొడుకు. రాజుని పెళ్లి చేసుకున్న తర్వాత నేను తల్లిని అవుతా. బంటీ గురించి నాకు ఏం తెలీదు ఇంతకంటే ఏం అడగకండి.
విజయాంబిక: రాజుకి కొడుకు ఉన్నాడు వాడిని ప్రపంచానికి తెలీకుండా పెంచుతున్నాడు. వాడు కొంపతీసి రూప కన్న బిడ్డ ఏనా.
దీపక్: అలా అయ్యే ఛాన్స్ లేదని నువ్వే చెప్పావు కదామ్మ.
విజయాంబిక: మన టైం ఏంటి జీవన్ ఇలా ఉంది చనిపోయింది అనుకున్న మందారం బతికే ఉందని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఎవరు అని అనుమానం.
రోహిణి: నేను బంటీ కోసం వచ్చాను బంటీకి ఇష్టమైన స్నాక్స్ తీసుకొచ్చా.
రాజు: బంటీకి ఏం కావాలో ఇంట్లో వాళ్లకి తెలుసు.
రోహిణి: అలా అనకు రాజు నాకు మీ తప్ప ఎవరు ఉన్నారు. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాకుండా నా హద్దుల్లో నేను ఉంటాను.
దీపక్: బంటీ రూప బిడ్డ కాదో తెలుసుకుందాం మమ్మీ డీఎన్‌ఏ టెస్ట్ చేద్దాం.
జీనన్: గుడ్ ఐడియా దీపక్. నేను రేపు ఈ బాబుని కిడ్నాప్ చేసే ప్లాన్ చేస్తా మీరు డీఎన్‌ఏ టెస్ట్ కోసం రూప గోళ్లు కానీ జుట్టు కానీ సంపాదించండి.
రూప తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకొని రాజుని పట్టుకోవడం రాజుతో మాట్లాడటం గుర్తు చేసుకొని నవ్వుకుంటుంది. ఇక దీపుని హోం వర్క్ చేయించడానికి పింకీ వెంట పడుతుంది. సుమ స్నాక్స్ తీసుకొని వస్తుంది. చంద్ర సుమతో ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా అని అనుకుంటారు. విజయాంబిక రూప దువ్వుకోవడం చూసి రూపని మాటల్లో పెట్టి దీపక్‌తో ఆ జుట్టు దొంగతనం చేయమని చెప్తుంది. దీపక్ ఆ గదిలోకి వెళ్లడంతో సూర్య చూసి పిలుస్తాడు. రూప గదిలోకి ఎందుకు వెళ్లావని సుమ అడుగుతుంది. దాంతో విజయాంబిక ఇన్నాళ్లు ఎప్పుడైనా వెళ్లాడా ఎందుకు అలా అనుమానిస్తారు అని అంటుంది. తర్వాత దీపక్ తల్లికి రూప వెంట్రుకలు ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.