Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆ బంధం అబద్ధమా.. నీతో నా జీవితం అబద్ధమా.. ఇలాంటి కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ మెడలో తాళి తీయడానికి విహారి లక్ష్మీని గుడికి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తాళి తీసేస్తా అని చెప్పడంతో లక్ష్మీ గదిలో అమ్మవారి బొమ్మ పట్టుకొని నేల మీద పడుకొని ఏడుస్తుంటుంది. ఉదయం విహారి రెడీ అయి తన ఫ్రెండ్ సత్యకి కాల్ చేస్తాడు. కనక మహాలక్ష్మీ కోసం కారు ఏర్పాటు చేశావా అని అడుగుతాడు. ఇంటికి కొంచెం దూరంలో కారు ఉందని చెప్తాడు. లక్ష్మీ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది.
లక్ష్మీ: తాను కట్టిన తాళి విహారి గారు తన చేతులతో తానే తీసేస్తా అంటున్నారు. ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకి ఏర్పడకూడదు. ఇలాంటి సందర్భం ఏం అమ్మాయికి రాకూడదు. ఈ ఆడపిల్లకి రాయకూడని నుదిటి రాత నా నుదిటి మీద రాసినట్లున్నావ్.
విహారి: ఫోన్‌లో కనక మహాలక్ష్మీ నువ్వు రెడీనా. లక్ష్మీ నువ్వు ఉన్న పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇలాంటి సందర్భానికి నీ మనసు ఒప్పుకోదు అని నాకు తెలుసు కానీ దయచేసి నా మాట విను.
లక్ష్మీ: విహారి గారు ఒక్కసారి నా మాట వింటారా.
విహారి: లేదు కనక మహాలక్ష్మీ ఈ సారి నా మాట నువ్వు వినాలి. నేను అన్నీ సిద్ధం చేశాను. ఇంటి దగ్గర్లో కారు కూడా ఉంది. ఇప్పుడు వెళ్లి నువ్వు ఆ కారులో కూర్చొ డ్రైవర్ నిన్ను గుడికి తీసుకొస్తాడు. సరేనా.
లక్ష్మీ: మీరు అన్న మాటకు అవును అని అనలేకపోతున్నా. మిమల్ని అగౌరవ పరుస్తూ కాదు అనలేకపోతున్నా.
విహారి: చూడు లక్ష్మీ మన చుట్టూ పెద్ద సమస్యల వలయం ఉందని దాని నుంచి మనం తప్పించుకోవడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలి. ప్లీజ్ కనక మహాలక్ష్మీ నిన్ను ప్రాధేయపడటానికి ఇంకా నేను దిగజారలేను.
లక్ష్మీ: అయ్యో మీ కోసం ప్రాణం ఇవ్వడానికి అయినా సిద్ధపడతాను. అలాంటిది మీ మాట వినలేనా. నేను మీరు చెప్పినట్లే చేస్తాను అని ఫోన్‌లో పెద్దగా ఏడుస్తుంది.
లక్ష్మీ తాళి పట్టుకొని చాలా పెద్దగా ఏడుస్తుంది. విహారి వెళ్తుంటే సహస్ర ఎదురు పడి ఎక్కడికి అని అడుగుతుంది. చిన్న పని ఉందని విహారి చెప్తే నా మీద ఇంకా కోపం పోలేదా బావ అని అడుగుతుంది. బావ నీ కోసం నేను ఎక్కువ పొసెసివ్ అయిపోతుంటా నన్ను కొంచెం భరించు బావ అంటుంది. విహారి ఆ విషయం వదిలేయ్ అని చెప్తే సహస్ర బావని సంతోషంతో హగ్ చేసుకుంటుంది. ఇక ఎల్లుండి బ్యాచ్‌లర్ పార్టీ ఉందని రమ్మని చెప్తుంది. విహారి బయటకు వెళ్లడం అంబిక చూస్తుంది. ఉదయం ఉదయం ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటుంది. అంబికను సహస్ర చూసి దగ్గరకు వెళ్తుంది. అంబిక కొత్త అనుమానం వచ్చిందని అంటుంది. విహారికి ఇంత ఉదయం ఏం పని అని అంబిక అంటే ఏదో పని ఉంటుంది అని సహస్ర చెప్తుంది. దాంతో అంబిక సహస్రని ప్రతీ దాన్ని మనం అనుమానించాలి అని చెప్తుంది. దాంతో సహస్ర కొత్త కొత్త అనుమానాలు పెట్టకు అని పెళ్లి అయ్యే వరకు ఎలాంటి అనుమానాలు పెట్టుకోనని బావ మీద నమ్మకం పెట్టుకొని నమ్మకంతో ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది.
అంబిక మాత్రం విహారిని నమ్మను అనుకొని ఏదో మోసం చేస్తున్నావ్ అనకొని ఆ మోసం బయట పెట్టే వరకు వదలను అనుకొని ఫాలో అవుతుంది. ఇక యమున అమ్మవారికి పూజ చేస్తుంది. లక్ష్మీ సంచి పట్టుకొని బయటకు బయల్దేరుతుంది. లక్ష్మీ పరధ్యానంలో ఉండటం చూసిన యమున ఏమైంది అని అడిగితే మార్కెట్‌కి వెళ్తున్నా అని చెప్తుంది. ఇంతలో వసుధ వచ్చి తాను కూడా మార్కెట్‌కి వస్తానని చెప్తుంది. లక్ష్మీ వద్దని చెప్పినా వసుధ వెళ్తుంది. ఇద్దరూ బయటకు వెళ్తారు. ఇంతలో వసుధ భర్తకి కాఫీ ఇవ్వాలని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో లక్ష్మీ ఊపిరి పీల్చుకుంటుంది. విహారి చెప్పినట్లు కారు ఎక్కుతుంది. డ్రైవర్ ఆమెను గుడికి తీసుకెళ్తాడు. అంబిక విహారిని ఫాలో అవుతుంటుంది. లక్ష్మీ గుడికి చేరుకుంటుంది. సత్య లక్ష్మీని తీసుకొని గుడిలోకి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!