అన్వేషించండి

Ammayi garu Serial Today January 28th: అమ్మాయి గారు సీరియల్: బంటీ కిడ్నాప్.. మందారం బతికే ఉందని తెలుసుకున్న రాజు..!

Ammayi garu Today Episode బంటీని జీవన్ కిడ్నాప్ చేయడం రాజు రూపలు మందారం, రాఘవని చూడటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూపని రాజు దగ్గరకు తీసుకుంటాడు. రూప, రాజు, బంటీ ముగ్గురూ హగ్ చేసుకుంటారు. రాజు, రూపలు ఇంత దూరంగా ఉంటానికి ఈ అనార్థం మొత్తానికి విజయాంబిక, దీపక్‌లే కారణం అని విరూపాక్షి అంటుంది. అప్పలనాయుడు సూర్యప్రతాప్‌తో విషయం చెప్దామని అంటారు. ఇప్పుడే వెళ్లి చెప్దామని రూప అంటుంది. ఇక రూప తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నందుకు, తన బిడ్డని తనకు అప్పగించినందుకు పింకీకి కూడా థ్యాంక్స్ చెప్తుంది. బంటీ కూడా పిన్నికి థ్యాంక్స్‌ చెప్తాడు. రూప, రాజుల సమక్షంలో బంటీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరూ హ్యాపీగా ఉంటారు.

బంటీ కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపిస్తాడు. ఇక విరూపాక్షికి అమ్మగారు అంటే అమ్మగారు కాదు అమ్మమ్మని అని చెప్తుంది. తర్వాత రూప బంటీని ఇంటికి తీసుకెళ్లి నాన్నతో విషయం చెప్పాలని అందరూ బయల్దేరుతారు. జీవన్ వాళ్లు బంటీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అందరూ ఆ కారు వెనక పరుగులు తీస్తారు. రాజు బండి తీసుకొస్తాడు. రూప, రాజులు బైక్‌లో బయల్దేరుతారు. ఇక విజయాంబిక, దీపక్‌లతో రూపకి బంటీనే తన కొడుకు అని తెలిసిపోయింది కాబట్టి బంటీని ఎలా అయినా చంపేయాలి అని ఫాలో అవుతారు. రౌడీలు బంటీని తీసుకొని ఎవరూ లేని ప్రాంతానికి పరుగులు తీస్తారు. వాళ్ల వెనకాలే రూప, రాజులు పరుగులు తీస్తారు.

ఆ వెనక విజయాంబిక, దీపక్‌లు పరుగులు తీస్తారు. అదే అడవిలో ఓ గుడెసెలో  రాఘవ మందారానికి ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. రాజు అనుకోకుండా చూసి ఎవరా అని దగ్గరకు  వెళ్లి చూస్తాడు. మందారాన్ని చూసి రాజు షాక్ అయిపోతాడు. తన చేతుల్లో చనిపోయిన మందారం శవాన్ని రూప ఇంటికి తీసుకెళ్లి రచ్చ చేసిన రాఘవ అది మందారమేనా కాదా అని కళ్లు తుడుచుకొని మరీ నిర్ధారించుకుంటాడు. అక్కడే రాఘవని కూడా చూస్తాడు. చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక రూప బంటీ కోసం రౌడీలతో గొడవ పడటం చూసి వెళ్లి వాళ్లని చితక్కొట్టి బంటీని కాపాడుతాడు. రూప బంటీని ముద్దాడుతుంది. 

ఇక రాజు రూపతో మందారాన్ని చూశానని చెప్తాడు. మందారానికి ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని పక్కనే రాఘవ కూడా ఉన్నాడని చెప్తాడు. రూప చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మందారాన్ని చంపాలి అనుకున్నది ఎవరో తెలుసుకొని వాళ్ల అంతు చూద్దామని రూప, రాజులు పరుగులు తీస్తారు. మరోవైపు రాఘవ అటుగా పరుగెడుతున్న విజయాంబిక, దీపక్‌లను చూసి మందారాన్ని తీసుకెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. రూప, రాజులు వెళ్లే సరికి వాళ్లు అక్కడ ఉండరు. ఇక రూప బంటీ విషయంతో పాటు మందారం విషయం తండ్రికి చెప్తే తండ్రినే చూసుకుంటాడని అంటుంది. ఆ మాటలు విన్న విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. రూప, రాజులు వెళ్లకుండా ఆపాలని అనుకుంటారు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తారు.

ఇక రూప, రాజు, బంటీ ఇంటికి వస్తారు. వాళ్లని దీపక్ వాళ్లు ఫాలో అవుతారు. రాజు వాళ్లు ఇంట్లోకి వెళ్లే టైంకి జీవన్ కొత్త నెంబరుతో రాజుకి కాల్ చేస్తాడు. మీరు బంటీని తీసుకొని ఇంట్లోకి వెళ్తే మందారం, రాఘవని చంపేస్తానని అంటాడు. దాంతో రాజు భయపడతాడు. రూపకి విషయం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీకు నాకు ఏ సంబంధం లేదు: మిథునని పుట్టింట్లో వదిలేసిన దేవా.. దేవాపై పిచ్చి ప్రేమలో భాను!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget