Ammayi garu Serial Today December 20th: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!
Ammayi garu Today Episode విజయాంబిక మాటలు విని రూప, సూర్యలే తన బిడ్డని చంపేయమని చెప్పారని రాజు అపార్థం చేసుకొని రౌడీల దగ్గర నుంచి తన బిడ్డని తీసుకొని వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూపకి కొడుకు పుడతాడు. విజయాంబిక, దీపక్‌లు చనిపోయిన బిడ్డని రూప బిడ్డస్థానంలో పెట్టి రూప బిడ్డని తీసుకొని వెళ్లిపోతారు. ఆ బిడ్డని ఇద్దరు రౌడీలకు ఇచ్చి దూరంగా తీసుకెళ్లి చంపేయమని చెప్తారు. ఇక రాజు కూడా హాస్పిటల్‌కి వస్తాడు. నర్స్ వచ్చి చూసేసరికి బిడ్డ చనిపోయి ఉండటంతో డాక్టర్‌కి చెప్తుంది. బయట మనవడు పుట్టాడని సంబరాలు చేసుకుంటున్న సూర్యప్రతాప్ వాళ్లతో డాక్టర్ బాబుని చూసి రూప బిడ్డ చనిపోయాడని చెప్తుంది. అందరూ షాకైపోతారు. ఏడుస్తారు. విజయాంబిక, దీపక్ నవ్వుకొని దొంగ ఏడుపు ఏడుస్తారు.
అందరూ ఏడుస్తూ రూప దగ్గరకు వెళ్తారు. రూపకి ఇంకా మెలకువ రాదు. రూప చూస్తే తట్టుకోలేదని బిడ్డని తీసుకెళ్లి జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అని సూర్యప్రతాప్ నర్స్‌తో చెప్తారు. దాంతో నర్స్ బిడ్డని తీసుకొని వెళ్లిపోతుంది. ఇక అప్పుడే రూపకి మెలకువ వస్తుంది. రూప బిడ్డ కోసం అడుగుతుంది. ఫస్ట్ బిడ్డ ముఖమే చూడాలి అనుకున్నా బిడ్డ ఎక్కడ అని అడుగుతుంది. పాప పుట్టిందా బాబు పుట్టాడా అని తండ్రిని అడుగుతుంది. సూర్యప్రతాప్ ఏడుస్తూ బాబు పుట్టాడమ్మా అని చెప్పి ఏడుస్తాడు. అందరూ ఎందుకు ఏడుస్తున్నారు నా బాబు ఎక్కడ అని రూప అడుగుతుంది. దాంతో సూర్యప్రతాప్ బాబు చనిపోయాడని చెప్తాడు. రూప షాక్ అయిపోతుంది. పెద్దగా ఏడుస్తుంది.
మరోవైపు రాజు హాస్పిటల్‌కి వచ్చేసరికి రౌడీలు బిడ్డని తీసుకెళ్లడం చూసి వాళ్లని పట్టుకొని బిడ్డని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎవరు మీరు అని అడుగుతాడు. దాంతో బిడ్డ చనిపోయాడు పాతి పెట్టడానికి తీసుకెళ్తామని చెప్తారు. అప్పుడే బిడ్డ ఏడుస్తాడు. దాంతో రాజు వాళ్ల దగ్గర నుంచి బిడ్డని తీసుకొని వాళ్లకి నాలుగు తగిలిస్తాడు. దాంతో వాళ్లు ఆ బిడ్డ సీఎం గారి మనవడు అని చెప్తారు. రాజు షాక్ అయిపోతాడు. బాబుని చూసి ఎమోషనల్ అయి ముద్దాడుతాడు. ఈ బిడ్డ వాళ్ల బిడ్డ కాదని ఎవరో రక్తమని దూరంగా తీసుకెళ్లి చంపేసి పాతేయమని చెప్తారని చెప్తారు. ఆ విషయం సూర్యప్రతాప్, రూపలే చెప్పారేమో అని రాజు షాక్ అయిపోతాడు. ఇక రాజు ఆ రౌడీలతో బిడ్డను చంపేశామని చెప్పండని చెప్తాడు. రాజు ఆవేశంగా రూప వాళ్ల దగ్గరకు వెళ్తాడు. ఇక రాజు వెళ్లే సరికి రూపతో విజయాంబిక మీ నాన్న బిడ్డని పాతి పెట్టమని చెప్పాడని చెప్తుంది. ఆ రక్తమే తప్పుడు రక్తం అని అంటుంది.
రాజు ఆ మాటలకు షాక్ అయిపోతాడు. బిడ్డని చూడటం మాకు ఇష్టం లేదు నువ్వు చూడాలి అనుకుంటే చూడు అని సూర్యప్రతాప్ రూపలో అంటే రూప నేను చూడను వాడి ముఖం చూడటం నాకు ఇష్టం లేదని అంటుంది. ఆ మాటలకు రాజు షాకై అయి ఏడుస్తాడు. డబ్బు పిచ్చితో నా బిడ్డ ప్రాణాలతో తీయాలి అనుకున్నారా అని రాజు అపార్థం చేసుకుంటాడు. నా బిడ్డని మీ కంటే ధనవంతుడిని చేస్తానని అనుకుంటాడు. బిడ్డను తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. రూప బిడ్డని తలచుకొని ఏడుస్తుంది. కనీసం బిడ్డని తాకలేకపోయానని ఏడుస్తుంది. రాజు బిడ్డతో ఇంటికి వెళ్లడం చూసి అందరూ షాక్ అయిపోతారు. బిడ్డ ఎవరు అని అందరూ అడుగుతారు. బిడ్డలో చలనం లేదు చనిపోయాడా అని రూప చెల్లి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజుల బిడ్డని పురిటిలోనే చంపేసిన విజయాంబిక.. ఏళ్లు దాటేసిన కథ, ఎన్నో మలుపులు!