Ammayi garu Serial Today December 19th: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజుల బిడ్డని పురిటిలోనే చంపేసిన విజయాంబిక.. ఏళ్లు దాటేసిన కథ, ఎన్నో మలుపులు!
Ammayi garu Today Episode రాజు, రూపలను విజయాంబిక శాశ్వతంగా విడదీయడం రూపకి పుట్టిన బాబుని చంపేయాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూప ప్రెగ్నెంట్ అని తెలిసి రాజుని తీసుకొని విరూపాక్షి, ముత్యాలు ఫ్యామిలీ వస్తే దీపక్, విజయాంబిక అడ్డుకుంటారు. రూపకి రాజుని చూడటం ఇష్టం లేదని కలవదని చెప్తారు. అయినా రాజు వాళ్లు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. దీపక్ ఆడ్డుకోవడంతో రాజు దీపక్‌ని నెట్టేస్తాడు. దాంతో రూప తప్ప ఇంట్లో అందరూ బయటకు వస్తారు. దీపక్‌ని అందరూ కొడుతున్నారని విజయాంబిక చెప్తుంది. సూర్యప్రతాప్ రాకముందే రాజు వాళ్లని అడ్డుకోవాలని అనుకొని సెక్యూరిటీకి చెప్తుంది. సూర్య ప్రతాప్ ఏమైందని అడగటంతో విజయాంబిక, దీపక్‌లు మందారం చనిపోయినందుకు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని లేనిపోనివి తగిలిస్తారు.
సూర్యప్రతాప్: రూప ప్రెగ్నెంట్ అని తెలుసుకొని వచ్చారనుకున్నా.
సుమ: బావగారు వాళ్లని పిలిచి మాట్లాడితే ఏ గొడవ ఉండదు రాజు ఎలాంటి వాడో మనకు తెలీదా బావగారు.
విజయాంబిక: అంటే మామీదే అనుమానమా సరే అయితే పిలుస్తాం.
సూర్యప్రతాప్: అక్కర్లేదు సెక్యూరిటీ వాళ్లని బయటకు గెంటేయ్.
ముత్యాలు: పెద్దయ్య అంత మాట అనొద్దు.
విరూపాక్షి: సూర్య పంతానికి పోయి పిల్లల జీవితం నాశనం చేయొద్దు సూర్య.
సూర్యప్రతాప్: ఇక మీతో మాట్లాడి అనవసరం మీ ముఖం కూడా చూడం సెక్యూరిటీ వాళ్లని బయటకు గెంటేయండి.
ఆ మాటలు విని రూప బయటకు వచ్చి చూసే సరికి రాజు వాళ్లని గెంటేస్తారు. రూప రాజు అనుకొని బయటకు వస్తుంది. దీపక్ డోర్ వేసేస్తాడు. విజయాంబిక రూపతో ఫరిహారం, ఆస్తిలో వాటా అడిగారని చెప్తుంది. రూప విజయాంబిక మాటలు నమ్మదు. రాజు డబ్బు మనిషి కాదు అలా అడగడు అని అంటుంది. సూర్యప్రతాప్ కూడా వాళ్లెవరూ నీ గురించి అడగలేదు అని అంటాడు. దాంతో రూప ఏడుస్తూ వెళ్లిపోతుంది. అక్కడి నుంచి కథ మూడు నెలల ముందుకు వెళ్తుంది. మూడు నెలల తర్వాత కూడా రూప రాజు గురించి ఏడుస్తూనే ఉంటుంది. ముత్యాలు ఇంట్లో అందరూ ఏడుస్తూనే ఉంటారు. తర్వాత మరో మూడు నెలలు గడిచిపోతాయి. అందరూ ఏడుస్తూనే ఉంటారు. ఇంటిళ్లపాది బాధ పడుతూనే ఉంటారు. రూప రాజులు ఒకర్ని ఒకరు తలచుకొని బాధ పడుతూనే ఉంటారు. 8 నెలల తర్వాత రూపకి నెలలు నిండుతాయి. డాక్టర్ చెక్ చేస్తుంది.
ఒక రోజు రూపకి నొప్పులు రావడంతో మెట్ల మీదే కూలబడిపోతుంది. అందరూ వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. రూప డెలివరీ గురించి రాజుకి చెప్దామని చంద్ర అంటాడు. విజయాంబిక, దీపక్‌లు టెన్షన్ పడి సూర్యప్రతాప్ మనసు మార్చేలా మాట్లాడుతారు. మనం పిలవడం కరెక్ట్ కాదు అని చెప్తారు. రాజుకి నిజంగా ఇష్టం ఉండి ఉంటే ఈ తొమ్మిది నెలల్లో ఒక్కసారి అయినా చూడటానికి వచ్చేవాడు కదా అని ఎక్కిస్తారు. ఇక రూప డెలివరీ అయిన దగ్గరే ఓ భార్యభర్తల బాబు చనిపోయాడని నర్స్ చెప్పడం విజయాంబిక, దీపక్‌లు వింటారు. ఈ విషయం రాజుకి చెప్పాలని పింకీ ఎవరికీ తెలీకుండా రాజుకి కాల్ చేసి రూపకి నొప్పులు మొదలయ్యాయిని హాస్పిటల్‌లో ఉన్నామని రమ్మని ఫోన్ చేసి చెప్తుంది. విజయాంబిక బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి చనిపోయిన ఆ బిడ్డని తనకు ఇచ్చేయమని ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇస్తానని చెప్తుంది. దాంతో ఆ తల్లిదండ్రులు చనిపోయిన తమ బిడ్డని విజయాంబికకు ఇచ్చేస్తారు. ఇక దీపక్‌తో ఆ చనిపోయిన బిడ్డని రూప బిడ్డ స్థానంలో పెట్టి రూప బిడ్డని మనం చంపేయాలని అంటుంది. రూపకి డెలివరీ చేసి డాక్టర్ బాబు పుట్టాడని సూర్యప్రతాప్ వాళ్లతో చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. ఇంతలో దీపక్, విజయాంబిక వచ్చి ఆ రూప బిడ్డని తీసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప రెస్టారెంట్.. నిప్పు రాజేసిన పేరు.. భార్య వల్ల కార్తీక్ బికారీ అయిపోతాడా?