అన్వేషించండి

Ammayi garu Serial Today December 17th: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!

Ammayi garu Today Episode మందారం చావుకి రూప కారణం అని రూపని వదిలేసి రాజు వెళ్లిపోవడం రూప ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ఎమ్మెల్యేలను ఎక్కడ దాచారో తెలుసుకున్న మందారం రూప, రాజులకు విషయం చెప్తుంది. ఇక రాజు మందారం ఇప్పుడు ప్రమాదంలో ఉంది తోడుగా ఉండు అని రూపకి చెప్పి రాఘవని తీసుకురావడానికి వెళ్తాడు. అయితే మందారం ఎమ్మెల్యేలు గోవా వెళ్లకుండా ఆపమని రూపతో చెప్పడంతో రూప మందారాన్ని వదిలేసి వెళ్లిపోపోతుంది. దాంతో మందారాన్ని దీపక్, విజయాంబిక కత్తితో పొడిచి పొడిచి చంపేస్తారు. తర్వాత రాజు రాఘవని తీసుకొని అక్కడికి వచ్చేసరికి మందారం శవమై ఉంటుంది.

ఇక రాఘవని కూడా ఎవరో తీసుకెళ్లిపోతారు. రాజు మందారం శవాన్ని తీసుకొని సూర్య ప్రతాప్ ఇంటికి వచ్చి రూపనే చంపేసిందని అంటాడు. మందారం ప్రమాదంలో ఉంది వదలి వెళ్లొద్దని పదే పదే చెప్పినా వినకుండా వదిలేసి వచ్చి నువ్వే చంపేశావ్ అని రూప మీద విరుచుకుపడతాడు. తన తండ్రి సీఎం పదవి కోసం, తల్లిదండ్రులను కలపడం కోసం మందారం ప్రాణాన్ని బలి తీసుకుందని భార్య మీద విరుచుకుపడతాడు. 

రాజు: అంటే ఏంటి అమ్మాయి గారు మీ నాన్న గారు గెలివాలి. మీ అమ్మానాన్న కలిసిపోయి మీరు గెలవాలి. మీ కోసం మేం చచ్చిపోవాలా.
విరూపాక్షి: ఏం మాట్లాడుతున్నావ్ రాజు.
సూర్యప్రతాప్‌: ఆపు.. ఇదంతా నీ వల్లే జరిగింది. మందారం చనిపోయింది రూప వల్ల కాదు నన్ను కలవాలి అన్న నీ కోరిక వల్ల చనిపోయింది. అసలు నా బిడ్డకు ఏం నూరిపోశావో తెలీదు కానీ నా దగ్గర ఉన్న నీ గురించే ఆలోచిస్తుంది. నాకు ఎవరినీ కలిసే ఉద్దేశం లేదు. ఈ విషయంలో రాఘవ వచ్చి ఆ దేవుడే వచ్చినా ఈవిడతో నేను కలిసి ఉండటం అనేది జరగదు. ఇప్పుడు కూడా మందారం చావు అడ్డుపెట్టుకొని నన్ను కలవాలి అని వచ్చినట్లు ఉన్నావ్ అది కూడా జరగదు. నీకు రెండు చేతులు పెట్టి దండం పెడతా ఇప్పటికే నీ వల్ల ఓ ప్రాణం పోయింది మరో ప్రాణాన్ని పొట్టనపెట్టుకోకు. 
విరూపాక్షి: ఏంటి సూర్య నీతో కలవడానికి మందారం ప్రాణం అడ్డుపెట్టుకున్నాను అంటున్నావా. నీతో కలవడానికి ఒక ప్రాణం పోయేలా ఉంటే నాకు నీతో కలవాలి అని లేదు. అసలు ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే మందారం వెళ్లకుండా ఆపేదాన్ని.
రూప: అమ్మానాన్న మీరు గొడవ పడొద్దు.
సూర్యప్రతాప్‌: రూప నువ్వు రాఘవ దగ్గరకు రాజుని పంపడం ఒక తప్పు అయితే రాజు చెప్పినట్లు మందారం దగ్గర లేకపోవడం మరోతప్పు. అయినా నా గురించి తెలిసి కూడా రాఘవని తెస్తే మేం కలుస్తాం అని  మీరెలా అనుకున్నారు.
రాజు: ఈవిడ ఇలా మందారాన్ని వదిలేసి వెళ్లిపోతుందని తెలుసుంటే నేను వెళ్లేవాడినే కాదు. ఎవరు ఏమైపోయినా ఈవిడకు అనవసరం ఈవిడ ఫ్యామిలీ బాగుండాలి. ఈవిడ గారి తల్లిదండ్రులు కలిసి ఉండాలి.
రూప: రాజు..
రాజు: తప్పుగా మాట్లాడానా అమ్మగారు.
ముత్యాలు: చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్ రాజు. మీ ఇద్దరూ కలిసి ఉండాలని మందారం చాలా ప్రయత్నించిందిరా. అలాంటి మందారం కోపం మీ ఇద్దరూ గొడవ పడితే మందారం ఆత్మ శాంతించదురా. అయ్యిందేదో అయిపోయిందిరా మందారాన్ని సాగనింపే పని చూడండిరా.
రాజు: అమ్మ ప్రాణమే పోయిన తర్వాత ఆత్మ శాంతిస్తే ఏంటి శాంతిచకపోతే ఏంటి. మందారం ప్లేస్‌లో రేపు నేను ఉన్నా మీరు ఉన్నా ఇలాగే చంపదు అని గ్యారెంటీ ఏంటి అమ్మ.

రాజు అలా అనగానే రూప రాజుని లాగిపెట్టికొట్టేస్తుంది. రాజు మీద చేయి చేసుకున్నావ్ అని సూర్యప్రతాప్ రూపని తిడతాడు. ప్రాణం తీయగలిగే తనకి కొట్టడం లెక్క కాదు అని అంటాడు. నన్ను వదిలించుకోవాలనే మందారం శవాన్ని అడ్డుపెట్టుకుంటున్నాడని రూప రాజుని అంటుంది. ఇలాంటి వాడికోసం అన్నీ వదులు కోవడానికి సిద్ధపడ్డానని అందుకే లోకువ అయిపోయాను అని ఏడుస్తుంది. దానికి రాజు రూపతో ఇది అమ్మాయి గారు మీరు అని అంటాడు. నాకోసం ఐశ్వర్యం ఆస్తులు పక్కన పెట్టలేదు అని వాటి కోసం నన్ను దూరం పెట్టావని అంటాడు.  నిన్ను కాపాడుకోవాలని మా నాన్న కత్తిపోట్లకు గురయ్యాడని నేను ఎన్నో కష్టాలు పడ్డానని రాజు రేగిపోతాడు. మా అమ్మ నీ కాళ్లు పట్టుకుంది అయినా దయ చూపలేదు మమల్ని రోడ్డు మీదకు లాగి నిలవ నీడ లేకుండా చేశారని అంటాడు.

సూర్యప్రతాప్‌ అడ్డుకొని మందారానికి జరగాల్సిన కార్యక్రమం చూద్దామని అంటాడు. మందారాన్ని కాపాడుతానని మాటిచ్చాను తప్పానని రాజు అంటే దానికి రాఘవని తీసుకొస్తా అని నాకు మాట ఇచ్చావ్ కదా రాఘవ ఎక్కడ అని అడుగుతుంది. దానికి రాజు రూపని లాగిపెట్టి కొడతాడు. అందరూ రాజు మీద అరుస్తారు. మందారం చనిపోయిందనిఅనకుండా రాఘవ కోసం అడుగుతావా అని తిడతాడు. నువ్వు నన్ను కొట్టావా అని రూప అంటే నువ్వు కాబట్టి కొట్టాను వేరే ఎవరైనా అయితే చంపేసేవాడిని అని రాజు అంటాడు.

పేద వాళ్లు అంటే తనకు లోకువ అని అంటాడు. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి అని ఈ పేద మందారానికి నేను ఉంటాను ఇంకెవరూ అవసరం లేదని ముఖ్యంగా రూప నీ అవసరం లేదని మందారాన్ని తీసుకెళ్లిపోతాడు. మొదటి సారి రాజు రూపని పేరు పెట్టి రూప అని పిలవడంతో అందరూ షాక్ అయిపోతారు. రాజు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రూప కళ్లు తిరిగి పడిపోతుంది. డాక్టర్ వచ్చి చూసి రూప ప్రెగ్నెంట్ అని చెప్తారు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రాజీనామాని తాత ముఖం మీద విసిరి కొట్టిన కార్తీక్.. దీపే సర్వస్వం అని తేల్చేశాడుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget