Ammayi garu Serial Today December 11th: అనాథ ఆశ్రమాన్ని తామే తగులబెట్టామని చెప్పిన విజయాంబిక, దీపక్‌ను విరూపాక్షి,రాజు ఏం చేశారు..?
Ammayi garu Serial Today Episode December 11th: అనాథ ఆశ్రమాన్ని తామే తగులబెట్టామని విజయాంబిక చెప్పగానే...పట్టరానికోపంతో విరూపాక్షి ఆమె మెడపట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంది.

Ammayi garu Serial Today Episode: అనాథ ఆశ్రమం కాలిపోవడంతో విరూపాక్షి తీవ్రంగా ఏడుస్తుంది. పాపం అనాథలను ఎవరు పొట్టనపెట్టుకున్నారంటూ వెక్కివెక్కి ఏడుస్తుంది. వాళ్లను సొంత మనుషుల్లా చూసుకున్నాని ఆమె అంటుంది. పాతికేళ్లుగా వాళ్లే నా కుటుంబంగా బతికానని అల్లాడిపోతుంది. ఆమెను రూప ఓదార్చుతుంది.
అందరూ బాధపడుతుంటే విజయాంబిక,దీపక్ ముఖంలో మాత్రం నవ్వు ఉండటాన్ని కోమలి గమనిస్తుంది. ఇది మాపనే అంటూ ఆమె కోమలికి చెబుతుంది. అది వినగానే కోమలి షాక్‌కు గురవుతుంది. దీంతో కోమలి కూడా చాలా బాధపడుతుంది.మీ స్వార్థం కోసం అంతమందిని సజీవ దహనం చేస్తారా అని మనసులో అనుకుంటుంది. ఈ విజయాంబిక నరరూప రాక్షసిలా ఉందని...అనవసరంగా వీళ్లతో చేతులు కలిపానని భయపడుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వీళ్లకు ఎదురు చెప్పకూడదని...చెబితే నన్ను చంపడానికి కూడా వెనకాడరని అనుకుంటుంది. విరూపాక్షి ఏడుస్తుంటే...విజయాంబిక ఎంతో సంతోషపడుతుంది.
ఇంతలో మీడియావాళ్లు రాగా...సీఎం సూర్య వాళ్లతో మాట్లాడతాడు. ఈఆశ్రమం నడుపుతోంది విరూపాక్షి కాబట్టి...ఈప్రమాదంతోఆమెకు ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతారు.ఎంతోమంది అనాథలను చేరదీసి ఇన్నాళ్లు ఆశ్రమం కల్పించిందని...ప్రమాదం గురించి మాకు కూడా ఇప్పుడే తెలిసిందని చెబుతాడు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు చెబుతాడు. త్వరలోనే నిజాలు బయటపడతాయంటాడు.
విరూపాక్షి అనాథ శరణాలయం బూడిదవ్వడంపై ఎంతో బాధపడుతుండగా...రూపా అనుమానం వ్యక్తం చేస్తుంది.రాత్రికి రాత్రికి ఆశ్రమానికి నిప్పు అంటుకోవడం ఏంటని ప్రశ్నిస్తుంది. చూస్తుంటే ఇది ప్రమాదంలా కనిపించడం లేదని...ఎవరో కావాలనిచేసినట్లు ఉందని రాజు అంటాడు. వాళ్లకి ఎవరూ లేని అనామకులని...వాళ్లకు ఎవరు అపాయం తలపెడతారని విరూపాక్షి అంటుంది. అప్పుడే అక్కడికి విజయాంబిక, దీపక్ వస్తారు. ఆ అనాథలను అస్త్రాలుగా వాడుకుని మా అంతుతేల్చాలని చూస్తే మేం ఊరుకుంటామా అని అంటుంది. అందుకే వారిని మేమే తగులుబెట్టేశామని చెబుతుంది. ఈ మాటలు వినగానే విరూపాక్షికి, రాజుకు పట్టరానంత కోపం వస్తుంది. ఇద్దరూ వెళ్లి దీపక్, విజయాంబిక మెడపట్టుకుని పైకి లేపుతారు. ఇప్పటికే చాలాసార్లు వీరికి ఛాన్స్ఇచ్చామని...ఇక వీళ్లు బతికిఉండటానికి వీల్లేదని చంపేయమని రూప అంటుంది. అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు. విరూపాక్షి, రాజును మందలిస్తాడు. ఏంటి మీరుచేస్తున్న పని అంటూ విడిపిస్తాడు. ఏంటి మీరుచేస్తున్న పని అంటూ నిలదీస్తాడు. అనాథ ఆశ్రమానికి నిప్పు పెట్టింది వీరేనని చెప్పి విరూపాక్షి ఏడుస్తుంది. మేమే ఆ పని చేశామని వీళ్లే ఒప్పుకున్నారని రాజు కూడా చెబుతాడు.
సూర్యను చూసి విజయాంబిక వెంటనే మాటమారుస్తుంది. వాళ్లంతా అబద్దాలు చెబుతున్నారని నాటకం ఆడుతుంది. అనాథ శరణాలయం తగులబెట్టాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంటుందని అంటుంది.అప్పుడే రూప కల్పించుకుని నిజం బయటకు రాకుండా నిప్పుల్లో కాల్చేశారని చెబుతుంది. ఎందుకు మాపై లేనిపోని నిందలు వేస్తున్నారని విజయాంబిక అంటుంది.వీళ్లకు మనం ఇక్కడ ఉండటం ఇష్టంలేదని...అందుకే అబండాలు వేసి బయటకు పంపాలని చూస్తున్నారని దీపక్ అంటాడు. ఇంతలో విజయాంబిక కల్పించుకుని మా మాటలు నమ్మకపోయినా...నీ కూతురు రూప ఇక్కడే ఉంది కదా ఆమెను అడుగు అంటుంది. దీంతో కోమలి భయపడుతుండగా...విజయాంబిక కళ్లతోనే సైగ చేస్తుంది. దీంతో కోమలి కూడా అబద్దం చెబుతుంది.
విరూపాక్షిని ఓదార్చడానికి వస్తే...ఆమె అత్తయ్య గొంతు పట్టుకుందని చెబుతుంది. దీంతో సూర్య విరూపాక్షిని మందలిస్తాడ...నీకు అనుమానం వచ్చిన వాళ్లందిరినీ చంపుతానంటే ఎలా అని సున్నితంగా వారిస్తాడు. ఆధారం లేకుండా ఎవరిపైనా నిందలు వేయవద్దంటాడు. కేసు గురించి దర్యాప్తునకు ఆదేశించాన్ని సాక్ష్యాలు దొరికే వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని అంటాడు. నిజంగా ఎవరైనా ఆశ్రమాన్ని తగులబెట్టి ఉంటే...వారికి కూడా అలాంటి శిక్ష వేయిస్తానని మాటిస్తాడు.అప్పటి వరకు అందరూ సైలెంట్‌గా ఉండాలని చెప్పి వెళ్లిపోతాడు. విజయాంబిక,దీపక్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
అక్కడే ఉన్న కోమలిని రూప బాగా తిడుతుంది.నీకు కనీసం మానవత్వం కూడాలేదని అంటుంది. నీతోపాటు కలిసిమెలిసి ఉన్న వాళ్లంతా ఆగ్నికి ఆహుతైనా కళ్లల్లో జాలిలేదు,మనసులో బాధకూడా లేదని ఉమ్మివేస్తుంది. పైగా నేరస్తులకు వత్తాసు పలుకుతావా అని నిలదీస్తుంది. ఇలాంటి బతుకు బతికినా చచ్చినా ఒక్కటేనంటుంది.





















