Ammayi garu Serial Today April 25th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌ని కాల్చడానికి మనిషిని పెట్టిన దీపక్.. రాధిక ఎంట్రీతో తారుమారు!
Ammayi garu Today Episode దీపక్, విజయాంబికలు సూర్యప్రతాప్‌కి ప్రాణహాని తలపెట్టారని రాధిక రూప, రాజులతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్, విరూపాక్షిలు రూప కోసం హోమం చేస్తుంటాడు. హోమం సక్రమంగా జరగకూడదని విజయాంబిక, దీపక్‌లు అడుగడుగునా ఆటంకాలు సృష్టించాలని చూస్తారు. హోమం అగ్ని వెలిగించాలని పంతులు చెప్పడంతో దీపక్ వెలిగిస్తానని అగ్గిపెట్టె తీస్తాడు. దాంతో తల్లీకొడుకులు ఇద్దరి చేతులు కాలిపోతాయి.
సూర్యప్రతాప్ పంతులుతో ఇది ఏమైనా అరిష్టమా అంటే కాదు ఇద్దరూ ఏవో మంటలు వచ్చే పదార్థాలు పట్టుకున్నారు చేతులు కడుక్కోవడం మర్చిపోయి వచ్చినట్లు ఉన్నారు అని అంటారు. తల్లీకొడుకుల చేతులు మాడిపోతాయి. విరూపాక్షి రూప, రాజులకు గంధం ఇచ్చి రాయమని చెప్తారు. రూప, రాజులు ఇద్దరి చేతులుకు గంధం రాస్తూ అమ్మానాన్నలకు మంటలు అంటుకోవడం లేదని చూస్తున్నారా.. మీరు మా అమ్మానాన్నల బట్టలకు భాస్వరం రాస్తే మాకు తెలీదు అనుకున్నారా అందుకే మీ ప్లాన్ మీకు తిప్పి కొట్టామని చెప్తారు. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. హోమం జరుగుతుంటే సూర్యప్రతాప్, విరూపాక్షిలను జంటగా చూసి అందరూ సంతోషపడతారు.
విజయాంబిక వాళ్లు కుళ్లుకుంటూ రెండో ప్లాన్‌లా ఓ వ్యక్తికి కాల్ చేసి సూర్యప్రతాప్‌ని షూట్ చేసేమని చెప్తాడు. ముందు సూర్యప్రతాప్‌ని కాల్చేసి తర్వాత అడ్డు వచ్చిన వాళ్లని దొరికిన వాళ్లని కాల్చేయమని చెప్తాడు. దీపక్ పురమాయించిన వ్యక్తి దూరంగా ఉన్న ఓ బిల్డింగ్‌లో ఉంటూ కాల్చడానికి రెడీగా ఉంటాడు. మరోవైపు గొర్రె బుజ్జితల్లీ అని రాధిక వెంట పడుతుంది. రాధిక తప్పించుకోవడానికి పరుగులు పెడుతూ ఆ బిల్డింగ్‌లోకి వెళ్తుంది. ఆ రౌడీని ఢీ కొట్టడంతో గన్ కింద పడిపోతుంది. రాధిక ఆ రౌడీని పట్టుకొని ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. రౌడీ పారిపోతాడు. రాధిక చూసి విజయాంబిక, దీపక్‌లను చూసి వీళ్లే సూర్యప్రతాప్‌ని చంపడానికి ప్లాన్ చేసినట్లున్నారను అనుకుంటుంది..
హోమం పూర్తయిపోతుంది. సూర్యప్రతాప్ జంట పూర్ణహుతి సమర్పిస్తారు. పంతులు ఇద్దరినీ దీవిస్తారు. తల్లిదండ్రులు ఇద్దరూ రూపని ఆశీర్వదిస్తారు. అమావాస్య పూర్తయితే దోషం పోతుందని అప్పటి వరకు రూపని జాగ్రత్తగా చూసుకోవాలని అమావాస్య రోజు మీ దంపతులు మీ అమ్మాయితో చండీయాగం జరిపించాలని అంటారు. రాజు రూపలు తల్లిని యాగం వరకు మాతో ఉండమ్మా అని అంటారు. సూర్యప్రతాప్ వద్దు అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత విరూపాక్షి రూప, రాజులకు థ్యాంక్స్ చెప్తుంది. విజయాంబిక, దీపక్‌లు రూపకి ప్రాణగండం ఉంది కాబట్టి రూపని చంపేయాలి అనుకుంటారు. ఐడియా సూపర్ అని దీపక్ అంటే రాధిక వచ్చి ఏంటి సూపర్ అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు. ఆ గన్‌తో ఉన్న షూటర్ మీ మనిషే కదా మీరు మారరా దేవుడిలాంటి సూర్యప్రతాప్ గారి మీద మీకు ఎందుకు ఇంత పగ అని ప్రశ్నిస్తుంది. ఆస్తి కోసం ఆశపడ్డ నాకు కుర్చీ కోసం ఆశ పడ్డ జీవన్‌లకు ఏం శిక్ష పడిందో చూసి కూడా మీరు మారరా అని తిడుతుంది.
రాధిక రూప, రాజులతో సూర్యప్రతాప్ గారికి బయట నుంచి కంటే ఇంట్లోనుంచే ఎక్కువ ప్రమాదం ఉందని చెప్తుంది. బయట నుంచి షూట్ చేయడానికి షూటర్‌ని పెట్టారని జరిగింది చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు.అత్తయ్య వాళ్లు ఇంత దారుణానికి ఒడిగట్టారా అని రూప కంగారు పడుతుంది. జాగ్రత్తగా ఉండండి అని రాధిక చెప్తుంది. వాళ్లు ఏం చేస్తే దారిలోకి వస్తారో తెలీడం లేదని రూప అంటే రాధిక ఐడియా ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















