Ammayi garu Serial Today April 24th: అమ్మాయి గారు సీరియల్: రూప కోసం ఈ సీతారాములు కలుస్తారా.. అంబిక తమ్ముడి ఫ్యామిలీని నాశనం చేస్తుందా!
Ammayi garu Today Episode రూప కోసం సూర్యప్రతాప్, విరూపాక్షి పక్కపక్కనే కూర్చొని హోమం చేయడానికి రెడీ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ రూప కోసం విరూపాక్షితో కలిసి పూజ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇదంతా రూప, రాజుల ప్లానే అని తల్లీకొడుకులకు తెలిసిపోతుంది. దేవుడు తమకు సహకరించినట్లే సహకరించి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడేం చేయాలా అనుకుంటారు. రాఘవని కనిపెట్టాలని ఈ పూజ ఎలా అయినా ఆపాలి అనుకుంటారు. విజయాంబిక ఓ ఐడియాను కొడుకుతో చెప్తుంది. దీపక్ సూపర్ నువ్వు చెప్పినట్లు చేస్తే ఒక్కరు కూడా మిగలరు అని అంటాడు.
ఉదయం అందరూ గుడికి వెళ్తారు. తన తల్లి ఏ తప్పు చేయలేదని తండ్రి గుర్తించి తల్లిని స్వీకరించేలా చేయమని రూప కోరుకుంటుంది. మరోవైపు విరూపాక్షి గుడికి వస్తుంది. సుమ భర్తతో అక్క బావ గారితో చాలా ఏళ్ల తర్వాత పూజలో కూర్చొంటుంది అని అంటుంది. ఏ ఆటంకం లేకుండా పూజ పూర్తి అవ్వాలి అని చంద్ర అంటారు. విజయాంబిక దీపక్‌తో పూజని ఆపడానికి మన ప్రయత్నం మనం చేయాలి అని అంటుంది. పూజని చెడగొట్టే వరకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేద్దాం అని దీపక్ అంటాడు. ఇక విరూపాక్షి సూర్యప్రతాప్ వాళ్ల దగ్గరకు వస్తుంది. సంతోషంగా సూర్య అని పిలుస్తుంది. రూప, రాజు, చంద్ర, సుమ సంతోషంగా విరూపాక్షిని చూస్తారు.
సూర్యప్రతాప్ మాత్రం ఏం మాట్లాడడు. విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ అవసరం లేదు పూజలో కూర్చొంటే చాలు అని అంటాడు. నీ పక్కన భార్యగా కూర్చొనే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటుంది. దానికి సూర్యప్రతాప్ నిన్ను నా భార్యగా అంగీకరించడం అనేది ఈ జన్మలో జరగని పని కేవలం రూపకి అమ్మలా మాత్రమే కూర్చొంటావ్ అని అంటాడు. రూపకి దోషం ఉంది అందుకు దోష నివారణ చేయకపోతే రూప ప్రాణాలకే ప్రమాదం అని అందుకే పిలిచానని అంటాడు.
పంతులు విరూపాక్షి, సూర్యప్రతాప్‌లకు పట్టు బట్టలు కట్టుకోమని అంటాడు. విజయాంబిక మొదటి ప్లాన్‌గా పట్టుబట్టలకు భాస్వరం రాస్తారు. హోమం దగ్గర కూర్చొంటే ఇద్దరూ కాలిపోతారని కొడుకుతో చెప్పి విజయాంబిక సంబర పడిపోతుంది. ఇక రాధికను గొర్రె ఫాలో అవుతూ బుజ్జితల్లి బుజ్జితల్లి అని వెంటాడుతుంది. రాధిక పరుగులు పెడుతుంది. వందలాది గొర్రెలు వెంటపడే ఏకైక గొర్రెను నేను నీ వెంట పడుతున్నాను అని చులకన చేయకు బుజ్జితల్లి నన్ను పెళ్లి చేసుకో నీ కొడుకుని నా కొడుకుగా చూసుకుంటా మళ్లీ మనకు పిల్లలు వద్దు అని గొర్రె రాధికను సతాయిస్తుంది.
విరూపాక్షి, సూర్యప్రతాప్ ఇద్దరూ పట్టు బట్టలు మార్చుకొని వస్తారు. తల్లిని రూప, మామయ్యని రాజు తీసుకొని వస్తారు. ఇద్దరూ హోమంలో పక్క పక్కన కూర్చొంటారు. ఇద్దరూ రూప ఆరోగ్యం గురించి మొక్కుకొని పూజ ప్రారంభిస్తారు. ఇద్దరూ కలిసి పూజ చేయడం చూసి రూప, రాజులు మురిసిపోతారు. ఇద్దరూ కలిసిపోతే జీవితాంతం ఇలాగే చూసుకోవచ్చని అనుకుంటారు. త్వరలనే రాఘవని తీసుకొచ్చి నిజం నిరూపిస్తానని రాజు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















