Ammayi garu Serial Today April 14th: అమ్మాయి గారు సీరియల్: రాధికను కారుతో సహ పెట్రోల్ పోసి తగలబెట్టేసిన జీవన్
Ammayi garu Today Episode రాధిక కోర్టుకి వస్తుంటే జీవన్ అడ్డుకొని కారు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప వాళ్ల ఫ్యామిలీ మొత్తం కోర్టు దగ్గరకు వస్తారు. ఇంతలో సూర్యప్రతాప్‌ని పోలీసులు తీసుకొస్తారు. మీడియా సూర్యప్రతాప్‌ని చుట్టు ముడుతుంది. నిజాలు తెలిసిన తర్వాతే వార్తలు రాయండి మీ ఇష్టం వచ్చినట్లు రాయొద్దని రూప, రాజులు మీడియాతో చెప్తారు. రాధిక ఇంకా రాలేదేంటని విజయాంబిక, దీపక్ అనుకుంటారు.
రూప రాధికకు కాల్ చేస్తుంది. వస్తున్నానని రాధిక అంటుంది. ఇక డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా అంటే అన్నీ తీసుకొచ్చావ్ చెక్ చేసిన తర్వాతే నిజం చెప్పు అని అంటుంది. రాధిక వచ్చేస్తుందని రాజుతో రూప చెప్తుంది. విజయాంబిక వాళ్లు చాలా సంతోష పడతారు. కోర్టులో వాదనలు మొదలవుతాయి. సూర్యప్రతాప్‌ని బోనులో నిల్చొపెడతారు. రాధిక తరఫు లాయర్ సీఎం అయిన సూర్యప్రతాప్ తన పీఏని బలవంతం చేయబోయారని ఆ మల్లెల మాధవిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారని చెప్తారు. తన క్లైంట్ అసలు పేరు రాధిక అని తనని ముందు ఉన్న అక్రమ సంబంధం వల్ల రాధికను మల్లెల మాధవిగా తీసుకొచ్చి పెట్టారని అంటారు. అంతా అబద్ధం అని రూప అంటుంది. రాధికను సూర్యప్రతాప్ పెళ్లి చేసుకోవాలని లాయర్ తన వాదనలు వినిపిస్తాడు.
డిఫెన్స్ లాయర్ ఏం చెప్తారు అని జడ్జి అడిగితే ఎవరూ ఏం మాట్లాడరు. అబద్దాన్ని నిజం అని చెప్పడానికి లాయర్లు కావాలి కాని నిజానికి అవసరం లేదని సూర్యప్రతాప్ అంటారు. రాధిక నిజం చెప్తానని అన్నదని లాయర్ని మాట్లాడుకోలేదని రూప రాజు అనుకుంటారు. రాధికకు రాజు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఇక రాధిక కారుకి జీవన్ అడ్డుగా వస్తాడు. మొత్తం అతని కారులతో రాధికను చుట్టు ముడతారు. రాధిక చాలా టెన్షన్ పడుతుంది. మరోవైపు సూర్యప్రతాప్ వాదనలు జరుగుతుంటాయి. సూర్యప్రతాప్ కేసు తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని పీపీ అంటారు. రాధిక రావడం లేదని అందరూ టెన్షన్ పడతారు. తన మీద నిందలు అన్నీ అబద్దాలే అని సూర్యప్రతాప్ జడ్జితో చెప్తారు. దాంతో జడ్జి రాధికను బోను లోకి పిలుస్తారు. కానీ రాధిక రాలేకపోతుంది.
జీవన్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని రాధిక అనుకుంటుంది. రాధిక కారు నుంచి బయటకు రావాలి అని ప్రయత్నిస్తే జీవన్ రానివ్వడు. రాధిక బతిమాలుతుంది. జీవన్ రాధికతో నన్నే మోసం చేస్తావా అని అంటాడు. నాకు సూర్యప్రతాప్ పతనం కావాలి అందుకు నువ్వు కారణం అవుతావు అనుకుంటే నువ్వు నన్ను మోసం చేస్తావా అని రాధికను కారులో బంధించి పెట్రోల్ పోసేస్తాడు. రాధిక కాపాడమని ఏడుస్తుంది. జీవన్ కారుకి నిప్పు పెట్టేస్తాడు. కారు కాలిపోతుంది. రాధిక ఆర్తనాదాలు పెడుతుంది. రాజు కాల్ చేస్తూనే ఉంటాడు. ఇక జీవన్ కారు కాలిపోవడం మొత్తం వీడియో తీస్తాడు.
రాధిక ఇంకా రాలేదా అని జడ్జి అడిగితే అంతకంటే బలమైన సాక్ష్యాలు ఉన్నాయని రాధిక సూర్యప్రతాప్ మీద అత్యాచారం కేసు పెట్టిన వీడియో చూపిస్తారు. అదంతా అబద్ధం అని రూప జడ్జితో చెప్తుంది. రూప బోనులోకి వెళ్లి నేను సూర్యప్రతాప్ గారి కూతురిని మా నాన్న ఇన్నేళ్లలో ఒక్క అమ్మాయి గురించి ఒక్క ఆడదాని గురించి తప్పుగా మాట్లాడలేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కోనేటిలో పడిపోయిన ఉష.. చూపుల్లోనే అదిరిపోయే ఎమోషన్స్..!!





















