Actor Shivaji: బుల్లితెరకు జడ్జ్‌గా వస్తున్న శివాజీ... 'జై జై గణేశా'లో ఇంద్రజ, ఖుష్బూలను టెన్షన్ పెట్టిన హీరో
Jai Jai Ganesha: వినాయక చవితి సందర్భంగా ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో 'జై జై గణేశా' ప్రోగ్రాం వచ్చింది. అందులో శివాజీ సందడి చేశారు. ఆయన చెప్పిన ఓ మాట ఇంద్రజ, ఖుష్బూలను టెన్షన్ పెట్టింది.
స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి హీరోలుగా సక్సెస్ అందుకున్న స్టార్స్ జాబితా తీస్తే చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో శివాజీ కూడా ఒకరు. హిందీలో షారుఖ్ ఖాన్, తమిళంలో శివ కార్తికేయన్, తెలుగులో శివాజీ... ముగ్గురు మధ్య ఉన్న ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే? టీవీల్లో కెరియర్ స్టార్ట్ చేసి సినిమాల్లోకి వచ్చి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు శివాజీ మరోసారి టీవీలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.
జై జై గణేశా... అదిరిందయ్యా!
తెలుగింటి పండగ వచ్చిందంటే... రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న తెలుగు వారైనా సరే... బుల్లితెర ప్రోగ్రామ్స్ చూడాలని అనుకుంటే ప్రయారిటీ ఇచ్చే ఫస్ట్ టీవీ ఛానల్ ఈటీవీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడాలనుకునే కార్యక్రమాలు చేయడంలో ఈటీవీ, మల్లెమాల సంస్థలు ముందు ఉంటాయి. ఈ వినాయక చవితికి 'జై జై గణేశా' పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రాం చేశారు. ఆ కార్యక్రమానికి హీరో శివాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జై జై గణేశా ఈవెంట్ విషయానికి వస్తే... చవితి రోజున టీఆర్పీ రేటింగ్స్ పరంగా అదరగొట్టిందని తెలిసింది. అంతే కాదు... వినోదం అందించడంలో కూడా ముందుంది. ఈటీవీ సూపర్ హిట్ రియాల్ట షోస్ జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నట్టు సాగిన జై జై గణేశా ఈవెంట్ బుల్లితెర వీక్షకులు అందరినీ ఆకట్టుకుంది. అటు జబర్దస్త్... ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ... రెండు కార్యక్రమాలకి చెందిన ఆర్టిస్టులు పోటా పోటీగా స్కిట్లు చేశారు. అది వీక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే... ఈ కార్యక్రమంలో శివాజీ చెప్పిన ఓ మాట ఇంద్రజ, ఖుష్బూలకు టెన్షన్ తెప్పించింది.
బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తున్న శివాజీ?
శివాజీ కెరీర్ టీవీలో మొదలైంది. ఓసారి ఆయన ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. అయితే ఇప్పుడు న్యాయ నిర్ణేతగా టీవీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి శివాజీ రెడీ అవుతున్నారని సమాచారం. జై జై గణేశా ఈవెంట్‌లో తాను ఒక కార్యక్రమానికి న్యాయ నిర్ణీతగా వస్తానని శివాజీ చెప్పారు. అయితే అది ఏ కార్యక్రమానికి అనేది ఆయన వెల్లడించలేదు. దాంతో అటు ఇంద్రజ, ఇటు ఖుష్బూ టెన్షన్ పడ్డారు.
Also Read: ఆస్పత్రిలో జాయిన్ అయిన దీపికా పదుకోన్ - ఏ క్షణమైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి ఇంద్రజ జడ్జ్. 'జబర్దస్త్' ఒక్కటి కాక ముందు... గురు, శుక్రవారాలలో వేరు వేరు పేర్లతో ప్రసారమయ్యేటప్పుడు... గురువారం వచ్చే 'జబర్దస్త్' కార్యక్రమానికి ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్' కార్యక్రమానికి ఖుష్బూ జడ్జ్. ఎక్స్ట్రా తీసేసి 'జబర్దస్త్' పేరుతో రెండు రోజులు ఒకే షో చేయడం మొదలు పట్టిన తర్వాత ఇంద్రజ తప్పుకోవాల్సి వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రమే ఇప్పుడు ఆవిడ న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు.
తాను జడ్జ్ స్థానంలోకి వస్తున్నానని శివాజీ చెప్పడంతో ఎవరి స్థానానికి ఎసరు పెడతారని వాళ్ళిద్దరూ చిన్నపాటి టెన్షన్ పడ్డారు. విశ్వసినీ వర్గాల సమాచారం ప్రకారం... ఈటీవీలో ఒక కార్యక్రమానికి శివాజీని న్యాయ నిర్ణేతగా తీసుకున్నారు. అయితే జడ్జ్ సీటులో ఉన్న సీనియర్ హీరోయిన్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదంట. వారితో పాటు శివాజీ కూడా జడ్జ్ అవుతారని వినబడుతోంది.
Also Read: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!