News
News
X

Tunisha Sharma: మేకప్ రూమ్‌లో ఉరేసుకుని ‘దబాంగ్-3’ నటి ఆత్మహత్య - టీవీ షోలో విషాద ఘటన

భారతీయ సినీ ఇండస్ట్రీ నుంచి మరో విషాద వార్త బయటకు వచ్చింది. టీవీ నటి తునిషా శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబై లో ఓ టీవీ షో సెట్ లో మేకప్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది...

FOLLOW US: 
Share:

ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ(20) ఆత్మహత్య చేసుకుంది. ముంబై లోని వాలివ్ లో జరుగుతోన్న ఓ టీవీ షో సెట్ లో మేకప్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సెట్‌లో విరామ సమయంలో టాయిలెట్ లోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాలేదు. సెట్ లో ఉన్న వాళ్లు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆమె ఉరి వేసుకొని కనింపించింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నటి తునిషా శర్మ మరణవార్త విని బాలీవుడ్‌ లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

తునిషా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తునిషా ‘భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్‌’తో టీవీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. పలు టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ‘అలీ బాబా: దస్తాన్-ఎ-కాబుల్‌’లో యువరాణి మరియమ్ పాత్రను పోషిస్తోంది. ‘బార్ బార్ దేఖో’, ‘కహానీ 2: దుర్గా రాణి సింగ్’, ‘దబాంగ్ 3’ వంటి చిత్రాలలో కూడా కనిపించింది. ‘బార్ బార్ దేఖో’లో కత్రినా కైఫ్ చిన్ననాటి పాత్రను పోషించింది. కలర్స్ టీవీలో వచ్చిన 'ఇంటర్నెట్ వాలా లవ్' సీరియల్ లో తునిషాకు మంచి పాపులారిటీ వచ్చింది.

తునిషా శర్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. తన ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ సెట్‌ లో అందరితో సరదాగా మాట్లాడే తునిషా అకస్మాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. 

Read Also: నటనలోనే కాదు, దర్శకత్వంలోనూ అదుర్స్ అనిపిస్తున్న సౌత్ స్టార్స్ వీళ్లే!

మరోవైపు తునిషా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే దానిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. శనివారం సెట్‌ లో అంతా మామూలుగానే గడిచింది. ఎప్పటిలాగానే తునీషా కూడా మేకప్ వేసుకుని సెట్స్‌ లో షూటింగ్ లో పాల్గొంది. ఆమె ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌ లో ‘‘తమ అభిరుచులతో ముందుకెళ్లేవారు.. ఎప్పుడూ ఆగిపోరు’’ అనే పోస్ట్ పెట్టింది. అదే ఆమె చివరి పోస్ట్.  

View this post on Instagram
 
A post shared by Tunisha Sharma (@_tunisha.sharma_)

Published at : 24 Dec 2022 08:19 PM (IST) Tags: Bollywood Tunisha Sharma Tunisha Sharma Death Tunisha Sharma Movies Tunisha

సంబంధిత కథనాలు

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్