‘పుష్ప 2’ షూటింగ్ ఫొటో బయటకు, ‘బాహుబలి 2’ని కొట్టలేకపోయిన జవాన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘పుష్ప2‘ షూటింగ్ స్పాట్ ఫోటోను షేర్ చేసిన శ్రీవల్లి - అదుర్స్ అంటున్న నెటిజన్లు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప: ది రూల్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సినీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ‘పుష్ప2’ను తెరకెక్కిస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో, దాన్ని తలదన్నేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ దుమ్మురేపింది. ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని గౌరవం ఆయనకు దక్కింది. దీంతో ‘పుష్ప2’పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'జవాన్' హిట్టే కానీ 'బాహుబలి 2'ని బీట్ చేయలేదు - ప్రభాస్ రికార్డ్స్ సేఫ్!
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ కొట్టారు. దాంతో ఆయన ఫ్యాన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీ! అయితే... హిందీ మార్కెట్ వరకు షారుఖ్ ఖాన్ తన పట్టు నిలబెట్టుకున్నారు. హిందీ వెర్షన్స్ ఓపెనింగ్స్ విషయంలో ఫస్ట్ రెండు ప్లేసులు ఆయన సినిమాలవే. అయితే... వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ చూస్తే ఇప్పటికీ 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
లావణ్యా త్రిపాఠికి జోడీగా 'బిగ్ బాస్' విన్నర్ - పెళ్లికి ముందు ఆ సిరీస్ కంప్లీట్ చేయాలని!
ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత కథానాయికలకు, అందాల భామలకు సరికొత్త అవకాశాలు వస్తున్నాయి. కేవలం కమర్షియల్ సినిమాల్లో సన్నివేశాలు, పాటలకు మాత్రమే పరిమితం కావడం లేదు. వెబ్ సిరీస్ (Web Series)లలో విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సైతం వెబ్ సిరీస్ (ఓటీటీ ప్రాజెక్టు)లకు ఓకే చెబుతున్నారు. ఆల్రెడీ ఓ వెబ్ సిరీస్ చేసిన ఆమె... ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల కామెడీ టైమింగ్ అదుర్స్ - 'రూల్స్ రంజన్' ట్రైలర్ వచ్చేసింది
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన తాజా సినిమా 'రూల్స్ రంజన్' (Rules Ranjan Movie). ఈ చిత్రంలో నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. 'డీజే టిల్లు', 'బెదురులంక 2012' చిత్రాలతో ఆమె విజయాలు అందుకోవడమే కాదు... యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జోడీ కారణంగా సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఎట్టకేలకు గోపీచంద్ 'రామబాణం' మూవీకి మోక్షం - త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ మూవీ 'రామబాణం' కి ఎట్టకేలకు ఓటీటీ మోక్షం లభించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వేసవి కానుకగా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లో గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి శ్రీవాస్ - గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని తెలియడంతో 'రామబాణం'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా ఈ మూవీతో హ్యాట్రిక్ సాధిస్తారని అంతా భావించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)