అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ‘రూల్స్ రంజన్’, ‘మ్యాడ్’, ‘మామా మశ్చీంద్ర’ రివ్యూలు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం, కొలతలు కూడా ఇచ్చేశారుగా!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆయన అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపియ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరబోతోంది. దుబాయ్‌లో ఉన్న మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదిలోనే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మేడమ్ టుస్సాడ్స్ వెల్లడించింది. అంతేకాదు, అల్లు అర్జున్ కొలతలు సేకరిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘దేవర’ సెట్స్‌లో ఎన్టీఆర్, సైఫ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్.. ఇది సినిమాకే హైలెట్ అట!
‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన VFX పనులు కూడా మొదలైనట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రూల్స్ రంజన్ రివ్యూ: కిరణ్ అబ్బవరం పెట్టిన రూల్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ను బ్రేక్ చేశాయా?
టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఆయన నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రూల్స్ రంజన్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఫన్నీగా కట్ చేశారు. అన్నిటికంటే ‘సమ్మోహనుడా’ పాట పెద్ద హిట్ అయి సినిమాపై అంచనాలు పెంచింది. మరి సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'మామా మశ్చీంద్ర'. దీనికి నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకుడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు లుక్స్, ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకుల చూపు పడేలా చేశాయి. మరి, సినిమా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'మ్యాడ్' రివ్యూ : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా ఎలా ఉందంటే? నవ్వించారా? లేదా?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమైన సినిమా 'మ్యాడ్'. ఇందులో రామ్ నితిన్, సంగీత్ శోభన్ మరో ఇద్దరు హీరోలు. 'జాతి రత్నాలు' కంటే ఎక్కువ నవ్విస్తుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. ప్రచార చిత్రాలు చూస్తే కాలేజ్ కామెడీని క్యాప్చర్ చేసినట్లు ఉన్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)