అన్వేషించండి

Allu Arjun: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడం టుస్సాడ్స్ లో మైన‌పు విగ్ర‌హం, కొల‌త‌లు కూడా ఇచ్చేశారుగా!

ప్రఖ్యాత మ్యూజియం మేడం టుస్సాడ్స్ లో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం కొలువుదీరబోతోంది. తాజాగా ఆయనను కలిసిన మ్యూజియం ప్రతినిధులు కొలతలు తీసుకున్నారు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ఓ రేంజ్లో  పాపులారిటీ సంపాదించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆయన అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపియ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌ లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరబోతోంది. దుబాయ్‌లో ఉన్న మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదిలోనే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మేడమ్‌ టుస్సాడ్స్‌  వెల్లడించింది. అంతేకాదు, అల్లు అర్జున్ కొలతలు సేకరిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

బన్నీ కొలతలు తీసుకున్న మ్యూజియం నిర్వాహకులు  

తాజాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ రిలీజ్ చేసిన వీడియోలో, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. మ్యూజియం ప్రతినిధులు బన్నీని కలిసి కొలతలు తీసుకున్నారు. స్టైలిష్ లుక్ లో విగ్రహాన్ని రూపొందించే పనిలో పడ్డారు శిల్పులు. ప్రస్తుతం విగ్రహం తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయట. ఈ ఏడాది(2023) చివరి నాటికి అల్లు అర్జున్ మైనపు విగ్రహం రెడీ కాబోతోంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో తొలిసారి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకోవడం, మేడమ్ టుస్సాడ్స్ లో విగ్రహం ఏర్పాటు కావడం వెంటవెంటనే జరిగిపోవడంతో బన్నీ ఫుల్ ఖుషీలో ఉన్నారు.  

సంతోషం వ్యక్తం చేసిన అల్లు అర్జున్

ఇక తాజాగా వీడియోలో అల్లు అర్జున్ “మేడం టుస్సాడ్స్ లో నా విగ్రహం పెడతారని అస్సలు ఊహించలేదు. ఇకపై మేడం టుస్సాడ్స్ మ్యూజిక్ కు వెళ్లిని ప్రతిసారి అందమైన మైనపు బొమ్మగా కనిపించబోతున్నాను. ఊహించుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.    

‘పుష్ప 2’ షూటింగ్ లో ఫుల్ బిజీ

ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' షూటింగ్‌లో బ‌న్నీ బిజీగా ఉన్నారు.   రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప: ది రూల్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో, ఈ చిత్రం కోసం సినీ లవర్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’లో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకోవడంతో ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించడం ఖాయం అని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ ఆగస్ట్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.  సందీప్ రెడ్డి వంగాతోను ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read Also: 'లియో'పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు, నిప్పులు చెరుగుతున్న విజయ్ ఫ్యాన్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం ఓటీటీ మూవీస్ - వీకెండ్ ఈ సినిమాలు చూసి రిలాక్స్ అవ్వండి
ఆదివారం ఓటీటీ మూవీస్ - వీకెండ్ ఈ సినిమాలు చూసి రిలాక్స్ అవ్వండి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర సిరి కూతురేనా.. అనుమానాలకు పద్మాక్షి చెక్ పెడుతుందా! మహా మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర సిరి కూతురేనా.. అనుమానాలకు పద్మాక్షి చెక్ పెడుతుందా! మహా మాస్టర్ ప్లాన్!
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nindu Manasulu Serial Today October 24th: నిండు మనసులు: ప్రేరణ, గణల ఎమోషనల్ సీన్! అన్నగా అండగా ఉంటానంటూ ప్రామిస్! విజయానంద్‌కి వణుకు!
నిండు మనసులు: ప్రేరణ, గణల ఎమోషనల్ సీన్! అన్నగా అండగా ఉంటానంటూ ప్రామిస్! విజయానంద్‌కి వణుకు!

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget