అన్వేషించండి

ఇటలీకి పవన్, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ కొత్త పాట - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

శ్రీలీల ప్లేస్​లో ‘ఏజెంట్’ బ్యూటీ, రౌడీ బాయ్ మూవీ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి!
తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీలీల కెరీర్ మాంచి స్వింగ్​లో కొనసాగుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలన్నీ చక్కటి విజయాలు అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆమె ఫస్ట్ చాయిస్ అవుతోంది. ప్రస్తుతం అరడజన్ కు పైగా చిత్రాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తల సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సత్యం రాజేష్ హీరోగా 'టెనెంట్' - 'పొలిమేర 2' తర్వాత మరో సినిమా
హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను 'సత్యం' రాజేష్ (Satyam Rajesh) నవ్వించారు. నటుడిగానూ మెరిశారు. హీరో హీరోయిన్లకు స్నేహితుడిగా పలు చిత్రాల్లో కనిపించారు. ఆయనలో హాస్య నటుడు మాత్రమే కాదు... హీరో కూడా ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... 'మా ఊరి పొలిమేర' సినిమా. అది ఓటీటీలో విడుదల అయినప్పటికీ... ఆ సినిమా ద్వారా ప్రేక్షకులను భయపెట్టారు 'సత్యం' రాజేష్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2' (Maa Oori Polimera 2 Movie)తో నవంబర్ 3న థియేటర్లలోకి వస్తున్నారు. అది కాకుండా హీరోగా మరో సినిమా కూడా చేస్తున్నారు ఆయన. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇటలీకి వెళ్ళిన పవన్ - అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా!
కొణిదెల వారి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన లావణ్యా త్రిపాఠి నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఆ వేడుక కోసం మెగా ఫ్యామిలీ హీరోలు ఇటలీ బయలుదేరి వెళుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం భార్య అన్నా లెజినోవాతో కలిసి ఇటలీ వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పవన్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాబోయే వధూవరుల కంటే ముందు రామ్ చరణ్, ఉపాసన ఇటలీ వెళ్లారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆమె మాటలకు కంటతడి పెట్టిన రక్షిత్, గుండెను కదిలిస్తున్న ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ టీజర్
తాజాగా కన్నడ నాట బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించింది.  ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ సినిమా ముందుగా కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. టాలీవుడ్ లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందమైన జీవితాన్ని గడిపేందుకు చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడే వేదనని ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు.  ఈ నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్ గా ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హమ్మ హమ్మ - సందీప్ కిషన్ సినిమాలో కొత్త పాట బావుందమ్మా!
యువ కథానాయకుడు సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌... ఇద్దరిది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి 'టైగర్' చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొత్త సినిమా 'ఊరు పేరు భైరవకోన'తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న తాజా 'ఊరు పేరు భైరవకోన' చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర సగర్వ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో 'హమ్మ హమ్మ' పాటను ఇవాళ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Embed widget