సామ్‌కు చైతూ లవ్లీ కాంప్లిమెంట్స్, వచ్చేశాయి ‘రామబాణం’, ‘ఉగ్రం’ రిజల్ట్స్ , ‘హనుమాన్’ పోస్ట్‌పోన్ - ఈ రోజు టాప్-5 విశేషాలివే!
విడాకుల తర్వాత చైతూ ఫస్ట్ టైమ్ సమంత గురించి మాట్లాడాడు. గోపీచంద్, అల్లరి నరేష్‌ల ‘రామబాణం’, ‘ఉగ్రం’ రిజల్ట్స్ వచ్చేశాయి. ‘హనుమాన్’ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరిన్ని సినీ విశేషాలు మీ కోసం.
సమంత ఓ లవ్లీ ఉమెన్, మా మధ్య గొడవలకు కారణం అదే, ఆసక్తికర విషయాలు చెప్పిన నాగ చైతన్య!
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి బైలింగ్వల్ మూవీ ‘కస్టడీ’. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత గురించి, తన జీవితం గురించి నాగ చైతన్య ఆసక్తికర విషయాలు చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
కర్నాటకలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం, ప్రాణ స్నేహితుడి గెలుపు కోసం కష్టపడుతున్న కామెడీ బ్రహ్మ!
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మే 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వం జోరుగా కొసాగుతుంది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. విజయమే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
రామబాణం రివ్యూ: గోపిచంద్ ‘రామబాణం’ లక్ష్యాన్ని ఛేదించిందా? గురి తప్పిందా?
జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ మార్కెట్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో గోపిచంద్. తన చివరి సినిమా ‘పక్కా కమర్షియల్’ నిరాశ పరిచింది. దీంతో తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ జానర్‌తో, రెండు సూపర్ హిట్లిచ్చిన డైరెక్టర్ శ్రీవాస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ సినిమాలను ఆకట్టుకునే విధంగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, రామబాణం కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రచారంలో నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఆ నమ్మకం ఏ మేరకు నిజం అయింది? రామబాణం ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఉగ్రం రివ్యూ: అల్లరోడి ఉగ్రరూపం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా?
ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ కొన్నాళ్లుగా రూటు మార్చారు. కొన్నాళ్ల క్రితం ‘నాంది’తో సీరియస్ సబ్జెక్ట్ ట్రై చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు అదే సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి ‘ఉగ్రం’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి సీరియస్ సబ్జెక్టుతో అల్లరి నరేష్ ఇప్పటివరకు చేయని యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘ఉగ్రం’ తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
వెనక్కి తగ్గిన హను-మాన్, వాయిదా ఎందుకంటే?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హను-మాన్'. 'జాంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఇది ఫస్ట్ పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆ మధ్య అనౌన్స్ చేసారు. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్నా, ఇంతవరకూ ప్రమోషన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).