Naga Chaitanya: సమంత ఓ లవ్లీ ఉమెన్, మా మధ్య గొడవలకు కారణం అదే, ఆసక్తికర విషయాలు చెప్పిన నాగ చైతన్య!
నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ ఆయన అయ్యారు. తాజాగా ఆయన మాజీ భార్య సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి బైలింగ్వల్ మూవీ ‘కస్టడీ’. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
సమంత లవ్లీ వుమెన్- నాగ చైతన్య
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత గురించి, తన జీవితం గురించి నాగ చైతన్య ఆసక్తికర విషయాలు చెప్పారు. “మేము విడిపోయి రెండు సంవత్సరాలు అయ్యింది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది పూర్తయ్యింది. విడాకుల తర్వాత మా ఇద్దరి జీవితాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్నని రోజులను చాల గౌరవంగానే చూస్తాను. నిజానికి సమంత లవ్లీ ఉమెన్. ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు. మీడియా ఊహాగానాల కారణంగానే మా మధ్య గొడవలు జరిగాయి. అవి పెద్దవయ్యాయి. చివరికి విడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి నేను మొదట్లో ఊహాగానాల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఇప్పటికీ నా పెళ్లి గురించి అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. ఏదేదో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. జీవితం చాలా బాగుంది. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. నేను నా గతం, నా వర్తమానం, భవిష్యత్తును సానుకూలతతో చూస్తాను. ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను” అని చెప్పుకొచ్చారు.
తెలుగు, తమిళంలో మంచి హిట్ అవుతుంది- నాగ చైతన్య
ఇక ‘కస్టడీ’ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నాగ చైతన్య తెలిపారు. “ఈ సినిమాతోనే వెంకట్ ప్రభు టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో చిత్రీకరించాం. డబ్ చేయలేదు. నేను ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నాను. సాధారణంగా హీరో విలన్‌ని చంపాలని చూస్తుంటాం. అయితే, ఈ సినిమాలో హీరో ఏదోవిధంగా విలన్‌ని బతికించుకోవాలి అని చూస్తాడు. అందుకే ఈ సినిమాకు ‘కస్టడీ’ అని పేరు పెట్టారు. ఇది పూర్తి యాక్షన్ సినిమాగా రూపొందింది. రైలులోని యాక్షన్ సీక్వెన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాకు యాక్షన్ సీన్స్ హైలైట్. అరవింద్ స్వామితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో సీనియర్ నటులు శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. కృతి శెట్టి, నేను ‘బంగార్రాజు’ సినిమాలో కలిసి పనిచేశాం. ఈ సినిమా తమిళ్, తెలుగులో మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను” అని వెల్లడించారు.
కష్టపడ్డా సక్సెస్ కాలేదు- నాగ చైతన్య
ఇక తన సోదరుడు అఖిల్ తాజా నటించి ‘ఏజెంట్’ సినిమా గురించి కూడా చై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని చెప్పారు. సినిమా కోసం తన బాడీని పూర్తి స్థాయిలో మార్చుకున్నాడని చెప్పారు. అయినా, అనుకున్న ఫలితం రాలేదన్నారు. కానీ, తప్పకుండా అఖిల్ హీరోగా నిరూపించుకుంటాడని చెప్పుకొచ్చారు.
Read Also: నేను చేసిన ఆ పిచ్చి పనులన్నీ నా భార్య డైరీలో ఉంటాయి: దర్శకుడు మారుతి