‘సలార్ 2’ షూటింగ్ అప్డేట్, ‘ఆయ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అభిమానులకు హీరో సూర్య ప్రత్యేక విందు - ఎందుకో తెలుసా?
కొందరు హీరోలు మాత్రమే కాదు.. వారి అభిమానులు కూడా ఎప్పుడూ సాయం చేసే విషయంలో ముందుంటారు. అలాంటి వారిలో సూర్య అభిమానులు కూడా ఉంటారు. తన అభిమానులకు, ప్రజలకు ఏ కష్టం వచ్చిన ముందుండే హీరోలలో సూర్య, కార్తీ కూడా ఒకరు. వీరు అభిమానులకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ.. ఎప్పటికీ వారికి అందుబాటులోనే ఉంటారు. అదే విధంగా తాజాగా సూర్య.. తన అభిమానులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశాడు. దానికి వారంతా కలిసి చేసిన సాయమే కారణం. ఈ విందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మహేష్ బాబు నా క్లాస్ మేట్, బెంచీలు ఎక్కి దూకుతూ అల్లరి చేసేవాళ్లం - కోలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్
మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇంతకీ అందేంటంటే? కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ఆయన క్లాస్ మేట్స్. ముగ్గురు కలిసి చదువుకున్నట్లు స్వయంగా సదరు తమిళ స్టార్ హీరో చెప్పారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సూర్య. అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది. తెలుగు సినిమా నటులు అక్కడే ఉండేవారు. కోలీవుడ్, టాలీవుడ్ నటుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అలా రెండు పరిశ్రమలకు చెందిన నటీనటుల పిల్లలు కూడా కలిసి చదువుకునే వారు. అలా, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి ఒకే స్కూల్లో చదువుకునే వారట. ఈ విషయాన్ని స్వయంగా సూర్య చెప్పారు. స్కూల్లో కార్తి, మహేష్, తాను మంచి ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లమని చెప్పారు. క్లాసులో బెంచీలు ఎక్కి దూకడంతో పాటు బాగా అల్లరి చేసే వాళ్లమని చెప్పారు. మహేష్ ఎప్పుడు చెన్నైకి వచ్చినా, చిన్న నాటి స్నేహితులను కలిసి సరదాగా గడుపుతారని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలోకి ‘ఊరు పేరు బైరవకోన’ - అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్
ఈ మధ్య చాలామంది సినిమాలను థియేటర్లకి వెళ్లి చూడటం మానేశారు. "ఆ ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయిగా" అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు. ఇక వాళ్ల ఫీలింగ్స్ నిజమయ్యేలా చాలా సినిమాలో రిలీజైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సర్‌ప్రైజింగ్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' అనే హారర్ సినిమా కూడా ఓటీటీల్లోకి వచ్చేస్తోందట. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని థియేటర్ల దగ్గర బాగానే ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు అనుకున్న టైం కంటే ఒక వారం ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని సోషల్ మీడియాలో టాక్ గట్టిగా నడుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'సలార్ 2'పై లీక్ ఇచ్చిన బాబీ సింహా - ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
'సలార్'(సీజ్ ఫైర్) ప్రభాస్ నటించిన ఈ సినిమాకి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. పోయిన ఏడాది డిసెంబర్ 22న రిలీజైన ఈ సినిమా దాదాపు రూ.600 వరకు వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 'సలార్' సినిమాకి సీక్వెల్ ఉందని ఇప్పటికే ప్రకటించింది టీమ్. పార్ట్ - 2కి ‘శౌర్యాంగ పర్వం' అనే టైటిల్‌ని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఇక ఇప్పుడు దానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చాడు సలార్ నటుడు బాబీ సింహా. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘ఆయ్’ అంటూ వచ్చేస్తున్న ఎన్టీఆర్ బావమరిది - క్రియేటివ్‌గా టైటిల్ రివీల్ చేసిన మేకర్స్
ఇటీవల ఎన్‌టీఆర్ కుటుంబం నుండి మరో కొత్త హీరో.. సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తనే నార్నే నితిన్. ప్రస్తుతం నెపోటిజంతో వచ్చిన హీరో అయినా.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అయినా అందరినీ ఒకేలాగా చూస్తున్నారు ప్రేక్షకులు. వారు చేసే సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అనుకుంటున్నారు. అలా ‘మ్యాడ్’ అనే మూవీతో నార్నే నితిన్.. హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఈ మూవీ విడుదలయిన ఆరు నెలల తర్వాత తన రెండో మూవీని ప్రారంభించాడు నితిన్. జీఏ 2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఒక క్రియేటివ్ వీడియోను విడుదల చేసి టైటిల్ గురించి బయటపెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)