అన్వేషించండి

Prabhas Salaar 2 : 'సలార్‌ 2'పై లీక్‌ ఇచ్చిన బాబీ సింహా - ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే

Prabhas Salaar 2 : పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'సలార్‌' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పార్ట్‌ -2 కోసం వెయిట్‌ చేస్తున్నారు అభిమానులు. దానికి సంబంధించి అప్‌డేట్‌ వచ్చేసింది.

Prabhas Salaar 2 :'సలార్‌'(సీజ్‌ ఫైర్‌) ప్రభాస్‌ నటించిన ఈ సినిమాకి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. పోయిన ఏడాది డిసెంబర్‌ 22న రిలీజైన ఈ సినిమా దాదాపు రూ.600 వరకు వసూలు చేసి భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 'సలార్‌' సినిమాకి సీక్వెల్‌ ఉందని ఇప్పటికే ప్రకటించింది టీమ్‌. పార్ట్‌ - 2కి ‘శౌర్యాంగ పర్వం' అనే టైటిల్‌ని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఇక ఇప్పుడు దానికి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చాడు సలార్‌ నటుడు బాబీ సింహా. 

షూటింగ్‌ అప్పుడే.. 

'సలార్‌ - 2' షూటింగ్‌ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బాబీ సింహా. తను నటించబోయే నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ గురించి ప్రస్తావించిన ఆయన ఈ సినిమా గురించి కూడా మాట్లాడారు. ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందని చెప్పారు బాబీ. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా రెడీ అయిపోయినట్లు గతంలో కూడా ఒకసారి చెప్పింది చిత్రబృందం. 

ప్రభాస్‌ కొంచెం లేట్‌? 

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్‌ ఏప్రిల్‌లో మొదలైనప్పటికీ ప్రభాస్‌ మాత్రం కొంచెం లేటుగా షూట్‌లో జాయిన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మిగతా సినిమాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న 'రాజాసాబ్' మూవీని కూడా చేస్తున్నారు ప్రభాస్. దీంతో ఆ షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆయన నటించిన  ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ చెప్పారు. దీంతో ప్రభాస్‌ ఆయా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండగా.. 'సలార్‌ - 2' షూటింగ్‌కి లేట్‌ అయ్యే అవకాశం ఉంది. 

ఇక సలార్‌ విషయానికొస్తే.. క్లైమాక్స్‌లో ఆసక్తికరమైన ప్రశ్నలను మేకర్స్ మిగిల్చారు. ప్రాణ స్నేహితులైన దేవ, వరదరాజ మన్నార్‌ మధ్య యుద్ధం కూడా రెండో భాగంలో ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో 'సలార్ పార్ట్-2' ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2పై భారీ అంచనాలు పెరిగిపోయాయి అభిమానుల్లో. ఇక ఇప్పుడు బాబీ సింహా ఈ అప్‌డేట్‌ ఇవ్వడంతో ప్రభాస్‌ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలైతే.. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.'సలార్‌ 'సినిమాలో శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, టిన్నూ ఆనంద్, దేవరాజ్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవిబస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

22 భాషల్లో 'కల్కి'

ఎన్నో రోజులు తర్వాత 'సలార్‌' తో సక్సెస్‌ అందుకున్నాడు ప్రభాస్‌. ఇక ఆయన తర్వాతి ప్రాజెక్ట్స్‌ చాలా ఆచితూచి తీసుకుంటున్నారనే చెప్పాలి. దాంట్లో భాగంగానే నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో 'కల్కీ 2898 ఏడీ' చేస్తున్నారు ప్రభాస్‌. ఇక ఆ సినిమాని పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్‌ చేసున్నారట మేకర్స్‌. ఏకంగా 22 భాషల్లో సినిమా రిలీజ్‌ చేస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్‌ ఏప్రిల్‌ 9న రిలీజ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈగర్‌గా ట్రైలర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. 

Also Read: టాలీవుడ్‌ ఎంట్రీపై 'ప్రేమలు' హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ జవాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget