అన్వేషించండి

Suriya: అభిమానులకు హీరో సూర్య ప్రత్యేక విందు - ఎందుకో తెలుసా?

Hero Suriya: హీరో సూర్య తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడన్నది తెలిసిన విషయమే. అయితే తాజాగా తను కొందరు అభిమానులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశాడు.

Hero Suriya Arranges Lunch To Fans: కొందరు హీరోలు మాత్రమే కాదు.. వారి అభిమానులు కూడా ఎప్పుడూ సాయం చేసే విషయంలో ముందుంటారు. అలాంటి వారిలో సూర్య అభిమానులు కూడా ఉంటారు. తన అభిమానులకు, ప్రజలకు ఏ కష్టం వచ్చిన ముందుండే హీరోలలో సూర్య, కార్తీ కూడా ఒకరు. వీరు అభిమానులకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ.. ఎప్పటికీ వారికి అందుబాటులోనే ఉంటారు. అదే విధంగా తాజాగా సూర్య.. తన అభిమానులకు ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశాడు. దానికి వారంతా కలిసి చేసిన సాయమే కారణం. ఈ విందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముందుకొచ్చిన సూర్య అభిమానులు..

గతేడాది డిసెంబర్‌లో మిగ్‌జాం తుఫాను.. తమిళనాడును ముంచేసింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయిన చెన్నైలో మిగ్‌జాం తీవ్రత ఎక్కువగా కనిపించింది. అందుకే వరదల్లో చిక్కుకున్న వారికి  సాయం చేయడం కోసం సూర్య.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. అంతే కాకుండా తన ఫ్యాన్స్‌ను వెళ్లి.. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయమని కోరాడు. దీంతో ఎంతోమంది సూర్య అభిమానులు.. తమవంతు ఆర్థిక సాయం చేయడంతో పాటు వరదల్లో చిక్కుకున్న వారికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. వారికి కార్తీ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. ఇది చూసి సూర్య చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అందుకే ఇతరులకు సాయం చేసిన తన అభిమానులను విందుకు పిలిచాడు.

ఎప్పుడూ ముందుండే హీరో..

మిగ్‌జాం తుఫాను సమయంలో బాధిత కుటుంబాలకు సాయం చేసిన అభిమానులను సూర్య విందుకు పిలవడంతో పాటు వారికి స్వయంగా వడ్డించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి సూర్య మంచి మనసును మరోసారి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. తన ఫ్యాన్స్ ఎవరు కష్టాల్లో ఉన్నారని తనకు తెలిసినా తనవంతు సాయం చేయడానికి సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అలా ఎంతోమంది అమ్మాయిలను చదివించడం, వారికి ఆర్థికంగా సాయంగా నిలబడడం.. ఇవన్నీ సూర్య చేస్తూనే ఉంటాడు. తను సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తాడు.

‘కంగువా’తో బిజీ..

ఇక సూర్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తను శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంగువా’లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దిశా పటానీ తొలిసారి జోడీ కట్టింది. ముందుగా ఏప్రిల్‌లో ‘కంగువా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయ్యి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కంగువా’లో సూర్య డిఫరెంట్ లుక్‌తో కనిపించడంతో అసలు సినిమాలో ఇంకెన్ని షేడ్స్ ఉంటాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: సింగర్‌గా మారిన శ్రద్ధా దాస్ - మ్యూజిక్ డైరెక్టర్ వద్దన్నా వినలేదుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget