అన్వేషించండి

Ooru peru bhairavakona: ఓటీటీలోకి ‘ఊరు పేరు బైరవకోన’ - అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్

Ooru peru bhairavakona: ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీల్లో త్వరగానే అందుబాటులోకి వస్తున్నాయి. సినిమా రిలీజైన నెలలోపే డిజటిల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతున్నాయి.

Sundeep Kishan's Ooru Peru Bhairavakona OTT Release Update : ఈ మధ్య చాలామంది సినిమాలను థియేటర్లకి వెళ్లి చూడటం మానేశారు. "ఆ ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయిగా" అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు. ఇక వాళ్ల ఫీలింగ్స్‌ నిజమయ్యేలా చాలా సినిమాలో రిలీజైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సర్‌ప్రైజింగ్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఇక ఇప్పుడు సందీప్‌ కిషన్‌ నటించిన 'ఊరు పేరు భైరవకోన' అనే హారర్‌ సినిమా కూడా ఓటీటీల్లోకి వచ్చేస్తోందట. ఫాంట‌సీ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని థియేటర్ల దగ్గర బాగానే ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు అనుకున్న టైం కంటే ఒక వారం ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని సోషల్‌ మీడియాలో టాక్‌ గట్టిగా నడుస్తోంది. 

స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడ? 

సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'. హర్రర్ జోనర్‌లో తీసిన ఈ సినిమా.. జనాల్లో మంచి క్రేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. ట్రైలర్‌, ఫస్ట్‌ పోస్టర్‌తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక ఫిబ్రవరి 16న రిలీజైన ఈ సినిమా డీసెంట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి. కలెక్షన్స్‌ కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్‌ మాత్రం భారీగా అమ్ముడపోయినట్లు టాక్‌ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ 'జీ 5' ఈ సినిమాకి భారీగా డబ్బులు చెల్లించినట్లు టాక్‌ వినిపిస్తోంది. 

ఇక, రూల్స్‌ ప్రకారం సినిమా రిలీజైన 45 రోజులకి ఓటీటీలోకి రావాలి. దీంతో అటు ఇటుగా మార్చి 15న ఓటీటీలో రీలీజ్‌ అవుతుంది అనుకున్నారు. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌కి సంబంధించి వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనుకున్న టైం కంటే.. ముందే రిలీజ్‌ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న ఈ సినిమా రిలీజ్‌ కానుందని సమాచారం. జీ 5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాని వీఐ ఆనంద్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు. 'ఊరు పేరు భైరవకోన' సినిమా రిలీజ్‌కి ముందు చిక్కులు ఎదుర్కొంది. లీగల్‌ ఇష్యూస్‌ రావడంతో సినిమా అనుకున్న టైం కంటే ఆలస్యంగా విడుదలైంది. కాగా.. ఫిబ్రవరి 16న ఎట్టకేలకు రిలీజైంది ఈ సినిమా. 

ఇక ఈ సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌కి మంచి టాక్‌ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఫస్ట్‌డే కలెక్షన్లు బాగానే వచ్చాయి. సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ ఓపెనింగ్‌ ఇచ్చిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'.

Also Read: ‘జై హనుమాన్’కు అంతా సిద్ధం - ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రశాంత్ వర్మ

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget