అన్వేషించండి

Prasanth Varma : ‘జై హనుమాన్’కు అంతా సిద్ధం - ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రశాంత్ వర్మ

Prasanth Varma :'హనుమాన్‌' చూసిన ప్రతి ఒక్కరు 'జై హనుమాన్‌' కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఎలా ఉంబోతుందో అని ఊహించేసుకుంటున్నారు. అయితే, సీక్వెల్‌ వేరె లెవెల్‌ అని చెప్పారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.

Prasanth Varma About Jai Hanuman: తేజా సజ్జ నటించిన 'హనుమాన్‌' మూవీకి ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. 150 థియేటర్లలో 50 రోజుల పాలు సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమా ఆడింది. ఇంకా కొన్నిచోట్ల జనాలు థియేటర్‌లో ఈ సినిమాని ఎక్స్‌పీరియెన్స్‌ చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఇటీవల 50 రోజుల వేడుకను జరుపుకుంది. ఆ సక్సెస్‌ని అందరితో కలిసి ఎంజాయ్‌ చేసింది. ఈ సందర్భంగా 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ 'జై హనుమాన్‌' గురించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. త్వరలోనే ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. 

వేరే లెవెల్‌ అంతే.. 

50 డేస్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన ప్రశాంత్‌ వర్మ.. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌ చెప్పారు. ఇలా 50 డేస్‌ ఫంక్షన్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. "జై హనుమాన్‌' వర్క్‌ స్టార్ట్‌ అయ్యింది. అతిత్వరలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయబోతున్నాం. హనుమంతుల వారే ఈ సినిమాలో హీరో. 'హనుమాన్‌' క్లైమాక్స్‌ చివర్లో ఐదు నిమిషాలు మీ అందరికీ విపరీతంగా నచ్చింది. ఆ క్లైమాక్స్‌ తరహాలోనే సినిమా రెండున్నరగంటల పాటు ఉండబోతుంది. ఈ సినిమాతో మిమ్మల్ని కచ్చితంగా గర్వపడేలా చేస్తా. కచ్చితంగా గ్రేట్‌ గ్రేట్‌ ఫిలిమ్‌ ఇస్తాను అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఈ సక్సెస్‌, గ్రాటిట్యూడ్‌ని రెస్పాన్సుబుల్‌గా తీసుకుని ఆ రుణాన్ని 'జై హనుమాన్‌'తో తీర్చుకోబోతున్నాను" అని అన్నారు ప్రశాంత్‌ వర్మ. 

సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయాలి..   

ప్రశాంత్‌ వర్మ ఇంకా ఏమన్నారంటే.. "50 రోజుల సెలబ్రేషన్ చూసి చాలా రోజుల అయ్యింది. అది 'హనుమాన్'కి జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్‌. సినిమా సక్సెస్ అనేది చాలామంది జీవితాలను మారుస్తుంది. ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, కాస్ట్‌, క్రూ, డిస్టిబ్యూటర్, ఎగ్జిబిటర్స్‌, థియేటర్లలో పనిచేసే వాళ్ల జీవితాన్ని మారుస్తుంది ఒక సక్సెస్‌ఫుల్ సినిమా. ఆ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. 50 రోజులు అయ్యాక రూ.20లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు చేయడం? అనుకుంటాం. సినిమా సక్సెస్ అయ్యింది, 50 రోజులు 150 థియేటర్లలో నడిచిందనేది అందరికీ చెప్పాలి. అప్పుడు చాలామందిలో నమ్మకం వస్తుంది. నా సినిమా ఒక వీకెండ్ ఆడితే చాలు, పెట్టిన డబ్బులు వస్తే చాలు అనే మైండ్ సెట్‌ నుంచి 50 రోజులు ఆడుతుంది. 100 రోజులు ఆడుతుంది అనే నమ్మకం కలుగుతుంది కొత్తవాళ్లలో. 'ఆ' సినిమా నిజానికి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది. అప్పుడు సక్సెస్ మీట్ పెట్టలేదు. దాంతో చాలామందికి అది కమర్షియల్‌ హిట్‌ అని తెలీదు. ఇక 'హనుమాన్‌' సినిమాని మీడియావాళ్లు జనాల్లోకి బాగా తీసుకెళ్లారు వాళ్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు" అని అన్నారు ప్రశాంత్‌. 

రీ మాస్టర్డ్‌ వెర్షన్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతోంది.. 

'హనుమాన్‌'రీ మాస్టర్డ్‌ వెర్షన్‌ వస్తోంది. అది ఇంకా సర్‌ప్రైజ్‌ చేయబోతోంది. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వచ్చిన హనుమాన్ సినిమా మేం బిల్డ్‌ చేసే చాలా పెద్దయూనివర్స్‌కి హెల్ప్‌ అవ్వబోతుంది. ఈ సినిమా సక్సెస్‌ వల్ల 20 ఏళ్లలో చేసే పనిని 5 ఏళ్లలో చేయబోతున్నాం. అదంతా మీ వల్లే. మీరు ఇచ్చిన సక్సెస్ కారణం. క్వాలీటీ సినిమాలు, వీలైనంత త్వరగా రెడీ చేసేందుకు పనిచేస్తున్నాం. ఇక 'హనుమాన్‌' స్పెయిన్‌, జపాన్‌, చైనాలో విపరీతంగా నచ్చింది. ఇంటర్నేషనల్‌ లెవెల్‌లో రిలీజ్‌ అవ్వబోతోంది. రేపు పొద్దున మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటబోతుంది. చాలా ఆనందంగా ఉంది. అదంతా నిరంజన్‌గారి వల్లే. ఇది ఒక్క స్టెప్ మాత్రమే చాలా మెట్లు ఎక్కబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గ్రేట్‌నెస్‌ చెప్పబోతున్నాం" అని మాస్టర్డ్‌ వెర్షన్‌ గురించి చెప్పారు ప్రశాంత్‌ వర్మ. 

'హనుమాన్‌' తేజ సజ్జ నటించిన ఈ సినిమాని ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా నిలిచిన ఈ సినిమా అనూహ్యంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. బాక్సాఫీస్‌ దగ్గర బంప్‌హిట్‌గా నిలిచింది. రిలీజ్‌ టైంలో ఈ సినిమాకి అసలు సరిపడా స్క్రీన్స్‌ కూడా లభించలేదు. కానీ, ఇప్పుడు మాత్రం 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. పాన్‌ ఇండియా లెవెల్‌లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటింది. ఇక ఈ సినిమాకి 'జై హనుమాన్‌' పేరుతో సీక్వెల్‌ తీసుకురానున్నారు.  

Also Read: టాలీవుడ్‌ ఎంట్రీపై 'ప్రేమలు' హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ జవాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget