అన్వేషించండి

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'యానిమల్' మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు బన్నీ తన సోషల్ మీడియా వేదికగా 'యానిమల్' మూవీకి రివ్యూ ఇవ్వడం విశేషంగా మారింది. అంతేకాదు సినిమా మైండ్ బ్లోయింగ్ అంటూ ఒక్కొక్కరి పర్ఫామెన్స్ పొగుడుతూ తన ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు బన్నీ. దీంతో బన్నీ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. యానిమల్ ఓ సినిమాటిక్ బ్రిలియన్స్ మూవీ అని బన్నీ ఆకాశానికి ఎత్తేసాడు. రణబీర్, రష్మిక, బాబి డియోల్, అనిల్ కపూర్ తృప్తి, సందీప్ రెడ్డి వంగ ఇలా ఒక్కొక్కరి గురించి పొగడ్తలు కురిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా నుంచి త్వరలోనే టీజర్ రాబోతోందట. అది కూడా ఈ నెలలోనే అని సమాచారం. డీటెయిల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో 'దేవర' కూడా ఒకటి. 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి వీరిద్దరి కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా 'దేవర' రాబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆ సినిమాల తర్వాతే 'యానిమల్' సీక్వెల్ ఉంటుంది - సందీప్ రెడ్డి వంగా!
రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా రణ్ బీర్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. సందీప్ వంగా తన మేకింగ్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ తో డైరెక్టర్ సందీప్ వంగా పేరు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘యానిమల్’లో వివాదానికి దారితీస్తున్న 5 సీన్లు ఇవే - అంత దారుణంగా ఉన్నాయా?
ఎంత బ్లాక్‌బస్టర్ సినిమాను అయినా విమర్శించే క్రిటిక్స్ ఉంటారు. సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసం తెరకెక్కించింది అన్నట్టుగా కాకుండా దాని వల్ల చూసే ఆడియన్స్ ప్రభావితం అవుతారని వాగ్వాదం చేసేవారు కూడా ఉంటారు. అందుకే మేకర్స్.. ఎన్నో రూల్స్ మధ్య తమ సినిమాలను తెరకెక్కించాల్సి ఉంటుంది. కొందరు మేకర్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నా సినిమా.. నా ఇష్టం అన్నట్టుగా ఉంటారు. అందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. తాజాగా తను తెరకెక్కించిన ‘యానిమల్’ గురించి ప్రేక్షకులంతా మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందులోని పలు సీన్స్ మాత్రం కాంట్రవర్సీలకు, చర్చలకు దారితీశాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
'కిక్', 'ఊసరవెల్లి', 'ఎవడు', 'రేసు గుర్రం', 'టెంపర్' వంటి హిట్ సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించారు. 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా మారారు. అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ, అల్లు అర్జున్ పాత్రకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత కొంత విరామం తీసుకుని 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చేశారు. నితిన్, శ్రీ లీల జంటగా నటించిన చిత్రమిది. ఇందులో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Must Have Gadgets: వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
Embed widget