‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ కొత్త ఎపిసోడ్ ప్రోమో, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
మా అంజిగాడిని పరిచయం చేస్తున్నాం, లేదంటే మాటొచ్చేతది - 'నా సామిరంగ'లో అల్లరోడు
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున చివరగా 'ఘోస్ట్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. దాంతో తన కొత్త ప్రాజెక్ట్ కోసం నాగ్ ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు 'నా సామిరంగా' అనే సినిమాని ప్రకటించాడు. చాలాకాలం తర్వాత నాగార్జున నటిస్తున్న పూర్తి స్థాయి మాస్ మూవీ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, గ్లిమ్స్, ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో వరలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిగా ఆశిక రంగనాథ్ కనిపించనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మూడు భాగాలుగా 'రామాయణం' - రణ్ బీర్, సాయి పల్లవి షూటింగ్‌లో జాయిన్ అయ్యేది అప్పుడే!
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ 'యానిమల్' మూవీ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక ‘యానిమల్’ మూవీతో రణబీర్ కి సౌత్ లోనూ భారీ క్రేజ్ ఏర్పడడంతో ఈ హీరో నటించే తదుపరి సినిమాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. యానిమల్ తర్వాత రణ్ బీర్ 'రామాయణం' సినిమాలో నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మ్యాజికల్ కాంబో మళ్లీ రిపీట్, ముచ్చటగా మూడోసారి రవితేజతో హరీష్ మూవీ
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో కలిసి హరీష్ శంకర్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ప్రకటించింది. ‘మిరపకాయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ, హరీష్ కాంబో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రవి తేజ స్పెషల్ ఫోటో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో రిపీట్, ‘రాక్షస రాజా’గా వస్తున్న రానా
టాలీవుడ్ స్టార్ హీరో రానా, దర్శకుడు తేజ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న దర్శకుడు తేజకు సాలిడ్ సక్సెస్ అందించింది. ఈ సినిమాలో రానాను గతంలో ఎప్పుడూ లేని విధంగా చూపించారు దర్శకుడు తేజ. రానాలోని కొత్త వేరియేషన్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో లవ్ ట్రాక్ బాగా ఆకట్టుకుంది. ఎమోషనల్ క్లైమాక్స్, సినిమా చివర లో రానా స్పీచ్ అద్భుతంగా అలరించాయి. అన్ని విషయాల్లో దర్శకుడు ఫుల్ కేర్ తీసుకోవడంతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాలయ్య షోలో శ్రియ, సుహాసిని సందడి - ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?
ఊర మాస్ హీరో, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘‘అన్‌స్టాపబుల్’ విత్ ఎన్బీకే’ టాక్ షో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. తొలిసారి టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన బాలయ్య అద్భుతంగా అలరించారు. ప్రస్తుతం ‘అన్ స్థాపబుల్’ లిమిటెడ్ ఎడిషన్ నడుస్తోంది. తాజాగా ఈ షోలో అందాల తారలు, అద్భుతమైన దర్శకుడు సందడి చేయబోతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ‘ఆహా’ ప్రోమో విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ 3వ ఎపిసోడ్ లో అందాల తార శ్రియ శరణ్, సీనియర్ నటి సుహాసిని, దర్శకులు హరీష్ శంకర్, జయంత్ సి. పరాంజీ పాల్గొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)