అన్వేషించండి

Rana Rakshasa Raja: ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో రిపీట్, ‘రాక్షస రాజా’గా వస్తున్న రానా

Rakshasa Raja: రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.

Rana Rakshasa Raja Movie First Look Poster: టాలీవుడ్ స్టార్ హీరో రానా, దర్శకుడు తేజ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’. 2017లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న దర్శకుడు తేజకు సాలిడ్ సక్సెస్ అందించింది. ఈ సినిమాలో రానాను గతంలో ఎప్పుడూ లేని విధంగా చూపించారు దర్శకుడు తేజ. రానాలోని కొత్త వేరియేషన్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో లవ్ ట్రాక్ బాగా ఆకట్టుకుంది. ఎమోషనల్ క్లైమాక్స్, సినిమా చివర లో రానా స్పీచ్ అద్భుతంగా అలరించాయి. అన్ని విషయాల్లో దర్శకుడు ఫుల్ కేర్ తీసుకోవడంతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

'నేనే రాజు నేనే మంత్రి' సీక్వెల్ గా ‘రాక్షసరాజా’

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రానాతో పాటు తేజ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు 6 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14 ) సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘రాక్షసరాజా’ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ లో రానా లుక్ టెర్రిఫిక్ గా చూపించారు. చేతిలో మిషన్ గన్ పట్టుకొని, నుదుట నామాలు, నోట్లో చుట్టతో బీభత్సంగా కనిపిస్తున్నారు. రానా ఫస్ట్ లుక్ సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వేళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఉంటుందా? లేదంటే కొత్తవారిని తీసుకుంటారా? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనే పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ కథాంశంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rana Daggubati (@ranadaggubati)

‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న రానా

ఇక ఈ ఏడాది ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రానా. సీనియర్ నటుడు, బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఇందులో నటించారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఏకైక ఇండియన్ సిరీస్‌గా రికార్డు సాధించింది. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా కనిపించారు. కంటెంట్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్న ఈ సిరీస్ కి సీక్వెల్ రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ‘రానా నాయుడు’ సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. సూప‌ర్న్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సిరీస్ సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు నిఖిల్ నటించిన స్పైలో అతిథి పాత్రలోనూ రానా కనిపించారు.

Read Also: బాలయ్య షోలో శ్రియ, సుహాసిని సందడి - ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget