Jagadhatri Serial Today August 4th: మర్డర్ కేసులో మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Jagadhatri Serial Today Episode August 4th: మర్డర్ కేసులో మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరులు దాడి చేశారు.

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మని సుధాకర్ పట్టుబట్టడంతో యువరాజు వాళ్ల మామకు ఫోన్ చేస్తాడు. శ్రీవల్లి పెళ్లిరోజునాటికి తీసుకొస్తాని చెప్పమని చెబుతాడు. అటు మినిస్టర్ కొడకు అత్యాచారం చేసిన అమ్మాయి బాడీపై వేలిముద్రలు దొరకడంతో మినిస్టర్ కొడుకు వేలిముద్రలు తీసుకోవడానికి జేడీ వెళ్లగా....మీనన్‌తో కలిసి మధుసూదన్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీనన్ ఎత్తులకు పైఎత్తులు వేసి ఇంటి లోపలకి వెళ్తుంది.
వైజయంతి ఏడుపు...పాపారాయుడు హామీ
శ్రీవల్లి తండ్రిని ఇంటికి తీసుకొస్తేనే ఇంట్లో ఉండనిస్తానని సుధాకర్ వార్నింగ్ ఇవ్వడంతో వైజయంతి ఏడుస్తూ గదిలో కూర్చుంటుంది.తల్లి బాధ చూడలేక ఈ టైంలో ఏం చేయాలో తెలియక యువరాజు వాళ్ల మామకు ఫోన్ చేస్తాడు.దీంతో వైజయంతి జరిగిన విషయం చెప్పి ఏడుస్తుంది. ఇప్పుడు నేను శ్రీవల్లి తండ్రిని ఎక్కడ నుంచి తీసుకురావాని అడుగుతుంది. శ్రీవల్లి పెళ్లిరోజు కల్లా ఆమె తండ్రిని తీసుకొస్తానని బావకు చెప్పమని చెబుతాడు.మిగిలిన విషయాలు నేను చూసుకుంటానని అంటాడు. లేని తండ్రిని ఎక్కడి నుంచి తీసుకొస్తావని అడగ్గా...అవన్నీ నీకు ఎందుకు నేను చూసుకుంటానని చెప్పాను కదా.....మీరంతా నేను చెప్పినట్లు చేయండి చాలు అంటాడు.
మినిస్టర్ ఇంటికి బయలుదేరిన జేడీ
పద్మ ఒంటిపై వేలిముద్రలను ఫోరెన్సిక్ వాళ్లు తీసుకున్నారని సాధు జేడీకి చెబుతాడు.అయితే ఇప్పడు మినిస్టర్ ఇంట్లోకి వెళ్లి అతనివి లేదా వాళ్ల అబ్బాయి వేలిముద్రలు తీసుకుని మ్యాచ్ చేస్తే సరిపోతుందని జేడీ అంటుంది.నువ్వు వెంటనే బయలుదేరి వెళ్లమని చెబుతాడు.నేను రమ్యవాళ్లకు వారెంట్ ఇచ్చి పంపిస్తానని అంటాడు. మధ్యలో సింధూ కూడా అదే కారులో ఎక్కి జేడీకి ఇరిటేషన్ తెప్పిస్తుంది. జేడీ వస్తుందని తెలిసి మధుసూదన్ చాలా భయపడతాడు. నా కొడుకుని తీసుకుని నువ్వు ఏదోవిధంగా పారిపొమ్మని మీనన్‌కు అప్పగిస్తాడు.ఇప్పుడు నీ కొడకు పారిపోతే ఈకేసు ఇంకా కఠినంగా మారుతుందని కాబట్టి నేను చెప్పినట్లు చేయమని చెబుతాడు.నీ కొడుకు ఎక్కడికి పారిపోవాల్సిన పనిలేదని...ఓ తైలం తీసి ఇస్తాడు.ఇది రాసుకుంటే వేలిముద్రలు పడవని చెబుతాడు. దీంతో ఆ జేడీ వచ్చినా ఉత్తి చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్తుందని అంటాడు.
జేడీని రాకుండా అడ్డుకున్న మీనన్
మినిస్టర్‌కు చెప్పి తన కార్యకర్తలను ఇంటి వద్దకు రప్పిస్తాడు. జేడీ,కేడీతోపాటు పోలీసులు ఇంట్లోకి రాగానే కార్యకర్తలు అడ్డుకుంటారు.ప్రతిపక్షాలతో చేతులు కలిపి మా మినిస్టర్ పరువు తీయడానికే పోలీసులు వచ్చారని నినాదాలు చేస్తారు. అయినప్పటికీ జేడీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా....మీనన్ మనుషులు జనంలో కలిసిపోయి రాళ్లు రువ్వుతారు. దీంతో సింధూకు స్వల్పంగా గాయమవుతుంది. అదనపు బలగాల కోసం జేడీ సాధుకు ఫోన్ చేస్తుంది.కానీ అప్పుడే ఆమెకు అనుమానం వస్తుంది.మీరు అదనపు పోలీసులను పంపించి లాఠీఛార్జి చేస్తే....దీన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల కుట్ర అంటూ మినిస్టర్ తప్పించుకోవాలని చూస్తున్నాడని కాబట్టి మీరు పంపించొద్దని అంటాడు. ఆ మట్టి బుర్ర మినిస్టర్‌కు ఇన్ని తెలివితేటలు లేవని...అంటే వాడివెనక ఎవరో ఉండి ఆడిస్తున్నారని సాధు అంటాడు. నాకు కూడా అదే అనుమానం కలుగుతోందని జేడీ అంటుంది. గన్ తీసుకుని కాల్చిపడేస్తామని బెదిరించి జేడీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా....ఆడవాళ్లు, చిన్నపిల్లను అడ్డం పెట్టిస్తాడు మీనన్.మమ్మల్ని చంపిన తర్వాతే లోపలకి వెళ్లాలనివారితో నినాదాలు చేయిస్తాడు.
సింధు అద్భతమై ఐడియా
జేడీ లోపలికి వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకుంటున్నారని సింధూ ఓ మంచి ఐడియా వేస్తుంది.నకిలీ నోట్లు తెచ్చి గాల్లో ఎగరవేయగా...కార్యకర్తలంతా నా నోట్లకోస ఎగబడతారు. అది చూసి మీనన్ షాక్ తింటాడు. జేడీ లోపలికి వస్తుందని తెలిసి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. మర్యదగా మాపని మమ్మల్ని చేయనివ్వకుంటే స్టేషన్‌కు తీసుకెళ్లి బుద్ధి చెబుతామని జేడీ హెచ్చరిస్తుంది. దీంతో మీనన్ మినస్టర్‌కు సైగ చేసి వేలిముద్రలు ఇవ్వమని చెబుతాడు. చేతులకు ఆల్రెడీ తైలం ఉందన్న దీమాతో మినిస్టర్ కొడుకు పోలీసులకు వేలిముద్రలు ఇస్తాడు.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















