అన్వేషించండి

‘ఖుషి’ ట్రైలర్ లాంచ్ డేట్, రికార్డు స్థాయిలో ‘జైలర్’ బుకింగ్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘కల్కి 2898 ఏడీ’ మళ్లీ వాయిదా? అసలు సంగతి చెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్
‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమయిన ప్రభాస్ చిత్రం.. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లలో మూవీ రిలీజ్ డేట్ 2024 జనవరి 12 అనే ఉంది. అయితే అదే అధికారిక విడుదల తేదీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ జనవరిలో విడుదలవ్వడం కష్టమని, అందుకే ఈ మూవీని మే నెల 9కి వాయిదా వేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఔట్‌పుట్ ప్రేక్షకులను మెప్పించడానికి చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని, అందుకే విడుదలకు చాలా సమయం పడుతుందని అని చెప్పారు మేకర్స్. దీంతో విడుదల పోస్ట్‌పోన్ విషయం కూడా నిజమేనేమో అని నమ్మడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక ఈ వార్తలకు నాగ్ అశ్విన్ తాజాగా చాలా స్మార్ట్‌గా సమాధానం చెప్పాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ఖుషి’ ట్రైలర్ వచ్చేస్తోంది - క్యూట్ పోస్టర్‌తో అప్‌డేట్ ఇచ్చిన మూవీ టీమ్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే ఒక కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కోలుకోలేని ఫ్లాప్‌లు అందుకున్న సమంత, విజయ్ దేవరకొండ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకుల్లో పాజిటీవ్ వైబ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక మేజర్ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘జైలర్’ ఊచకోత - ఆ రెండు హిట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన ప్రీబుకింగ్స్‌
కొంతమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అయినా.. ఆడియన్స్‌లో వారి క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అలాంటి హీరోల్లో రజినీకాంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన సినిమా అంటే ఒక పండగా లాగా సెలబ్రేట్ చేస్తారు అభిమానులు. తమిళనాడులో అయితే రజినీ సినిమా విడుదల అవుతుందంటూ చాలు.. సెలవులు ప్రకటించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. ఆయన చేసిన మూవీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా అభిమానులు మాత్రం రిజల్ట్‌ను ఎప్పుడూ పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే ‘జైలర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న రజినీ.. ప్రీ బుకింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించారు. అది కూడా ఇండియాలో కాదు.. అమెరికాలో. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓటీటీలోకి శివకార్తికేయన్ ‘మహావీరుడు’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీ అనేది ఊపందుకుంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటినుండో వాపోతున్నారు. అందుకే కొంతకాలం క్రితం అందరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన 8 వారాల పాటు ఓటీటీలో విడుదల అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయినా కూడా కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలో విడుదలయిన రెండు వారాలకే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. చాలావరకు చిత్రాలు థియేటర్లలో విడుదలయిన నెలరోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ లిస్ట్‌లోకి శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ కూడా చేరనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పునీత్ ఫ్యామిలీలో మరో విషాదం, బ్యాంకాక్ పర్యటనలో హీరో భార్య మృతి
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన చనిపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లగా అక్కడ తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు.  అప్పటికే  తను చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. స్పందన అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర బంధువు. 2021లో పునీత్ గుండెపోటుతో చనిపోగా, ఇప్పుడు వారికి కుటుంబానికి చెందిన స్పందన చనిపోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.  స్పందన భౌతికదేహాన్ని రేపు బెంగళూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అభిమానుల సందర్శన అనంతరం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget