News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ మళ్లీ వాయిదా? అసలు సంగతి చెప్పిన దర్శకుడు నాగ్ అశ్విన్

తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించి.. ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చాడు.

FOLLOW US: 
Share:

‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించి.. ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చాడు.

‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమయిన ప్రభాస్ చిత్రం.. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లలో మూవీ రిలీజ్ డేట్ 2024 జనవరి 12 అనే ఉంది. అయితే అదే అధికారిక విడుదల తేదీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ జనవరిలో విడుదలవ్వడం కష్టమని, అందుకే ఈ మూవీని మే నెల 9కి వాయిదా వేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఔట్‌పుట్ ప్రేక్షకులను మెప్పించడానికి చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని, అందుకే విడుదలకు చాలా సమయం పడుతుందని అని చెప్పారు మేకర్స్. దీంతో విడుదల పోస్ట్‌పోన్ విషయం కూడా నిజమేనేమో అని నమ్మడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక ఈ వార్తలకు నాగ్ అశ్విన్ తాజాగా చాలా స్మార్ట్‌గా సమాధానం చెప్పాడు.

అయోమయంలో ప్రభాస్ అభిమానులు..
ఒకవేళ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అయ్యింటే నాగ్ అశ్విన్ నేరుగా అలాంటిదేమి లేదు అని చెప్పవచ్చు. కానీ ఈ దర్శకుడి స్పందన ప్రభాస్ ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేసింది. ‘‘జాతకాలు, నక్షత్రాల కూటమిని స్టడీ చేస్తే దీనికి అధికారిక ప్రకటన ఇవ్వచ్చు’’ అన్నాడు నాగ్ అశ్విన్. అసలు అతడు చెప్పిన మాటకు అర్థం ఏంటి అని ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జనవరి 12న ప్రభాస్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది అని సంతోషడాలా లేదా మే 9 వరకు ఎదురుచూడాలా అని ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కానీ ఎక్కువశాతం విడుదల తేదీ పోస్ట్‌పోన్ అయ్యింది అన్న వార్తలను నాగ్ అశ్విన్ కొట్టిపారేయలేదు కాబట్టి మే 9కే ‘కల్కి 2898 ఏడీ’ వస్తుందని ఫిక్స్ అవ్వడం బెటర్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

నిర్మాత కోరిక మేరకు..
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ని అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. అయితే నిర్మాతకు మాత్రం ఈ సినిమాను మే 9కే విడుదల చేయాలనే ఆలోచన ఉన్నట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అశ్వినీ దత్ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ లాంటి చిత్రాలు మే 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ‘కల్కి 2898 ఏడీ’కు అదే తేదీకి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కూడా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అవ్వడానికి ఒక కారణమని తెలుస్తోంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: ‘జైలర్’ ఊచకోత - ఆ రెండు హిట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన ప్రీబుకింగ్స్‌

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 07 Aug 2023 11:54 AM (IST) Tags: Nag Ashwin Prabhas Ashwini Dutt Deepika Padukone Kalki 2898 AD Kalki 2898 AD Release Date

ఇవి కూడా చూడండి

Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

నయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్ - ఎటువంటి కట్స్ లేకుండానే రిలీజ్?

నయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్ - ఎటువంటి కట్స్ లేకుండానే రిలీజ్?

Bedurulanka 2012 OTT: సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన 'బెదురులంక 2012' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bedurulanka 2012 OTT: సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన 'బెదురులంక 2012' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Parineeti Chopra’s Wedding: రాజస్థాన్ లో పరిణీతి రాయల్ వెడ్డింగ్‌- పెళ్లికి ముందు ఇన్ని ప్రేమకథలా?

Parineeti Chopra’s Wedding: రాజస్థాన్ లో పరిణీతి రాయల్ వెడ్డింగ్‌- పెళ్లికి ముందు ఇన్ని ప్రేమకథలా?

Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

టాప్ స్టోరీస్

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత కీలక నిర్ణయం

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత కీలక నిర్ణయం

Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి

Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి

50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్‌ - ట్రూడోపై ఓటర్ల అసహనం

50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్‌ - ట్రూడోపై ఓటర్ల అసహనం