అన్వేషించండి

Kushi: ‘ఖుషి’ ట్రైలర్ వచ్చేస్తోంది - క్యూట్ పోస్టర్‌తో అప్‌డేట్ ఇచ్చిన మూవీ టీమ్!

‘ఖుషి’ మూవీ గురించి ఒక మేజర్ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ఇందులో ట్రైలర్ విడుదల తేదీ ఎప్పుడో రివీల్ చేశారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే ఒక కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కోలుకోలేని ఫ్లాప్‌లు అందుకున్న సమంత, విజయ్ దేవరకొండ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకుల్లో పాజిటీవ్ వైబ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక మేజర్ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

క్యూట్ పెయిర్ అంటూ కామెంట్స్..
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా ప్రారంభమయినప్పటి నుండి ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. పైగా ఈ మూవీ నుండి విడుదలయ్యే ప్రతీ పోస్టర్, గ్లింప్స్, సాంగ్స్‌లో విజయ్, సమంత పెయిర్ చాలా క్యూట్‌గా అనిపిస్తోంది. దీంతో లవ్ స్టోరీలను ఇష్టపడేవారు ‘ఖుషి’ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చూస్తున్నారు. ప్రేమకథలను మరింత అందంగా తెరకెక్కించే శివ నిర్వాణ.. విజయ్, సమంత పెయిర్‌ను ఇంకెంత అందంగా చూపించి ఉంటాడో అని అప్పుడే ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు కూడా. 

ట్రైలర్ నిడివి కూడా చెప్పేశారు..
తాజాగా ‘ఖుషి’ట్రైలర్ ఆగస్ట్ 9న విడుదల కానుందని మూవీ టీమ్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకండ్లు ఉంటుందని కూడా రివీల్ చేశారు. ట్రైలర్ గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వడం కోసం విజయ్, సమంత కలిసున్న ఒక క్యూట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘ఖుషి’ నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు మంచి మెలోడీస్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ లవర్స్ అయితే ఈ సాంగ్స్‌ను లూప్‌లో వింటున్నారు. ఇప్పటివరకు ‘ఖుషి’ నుండి విడుదలయిన ఏ ఒక్క అప్డేట్‌కు కూడా నెగిటివ్ రివ్యూ రాలేదు. పైగా సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పుడు అసలు విజయ్, సమంత పెయిర్ ఎలా ఉంటుందో అని విమర్శించిన వారు కూడా ఇప్పుడు వారిని చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని ప్రశంసిస్తున్నారు.

సెప్టెంబర్ 1న ‘ఖుషి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్, సమంత కలిసి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’లో పెయిర్‌గా నటించినా.. అందులో వీరి కెమిస్ట్రీని పండించే అవకాశం మాత్రం రాలేదు. కానీ ‘ఖుషి’లో మాత్రం వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుండదనుందని ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమయ్యింది. ‘ఖుషి’ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి సమంత సినిమాలో నటించడం లేదని, ‘ఖుషి’ని పక్కన పెట్టేసిందని అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ మూవీ టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు ‘ఖుషి’ మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ.. అందరికీ గట్టి సమాధానమే ఇచ్చారు. అంతే కాకుండా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మూవీ షూటింగ్‌ను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురానున్నారు.

Also Read: చిన్మయి కవల పిల్లలతో సమంత ఆట పాటలు - వీడియో వైరల్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget