By: ABP Desam | Updated at : 27 Apr 2023 05:15 PM (IST)
Tollywood Entertainment Top-5 updates
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మధ్య ఫ్రెండ్షిప్, బ్రోమాన్స్ గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఇటీవల బన్నీ బర్త్ డే సాక్షిగా సోషల్ మీడియాలో ఆ బాండింగ్ అందరూ చూశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 'పుష్ప 2' సెట్స్ లో జనాలు ప్రత్యక్షంగా చూశారని టాక్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దర్శకుడు సుకుమార్ (Sukumar)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అభిమానుల్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. ఒకానొక సందర్భంలో సుకుమార్ మాస్ మీద దృష్టి పెడితే మనం సర్దుకోవాలేమో అని సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూసినప్పుడు అనిపిస్తుందని జక్కన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన రేంజ్ ఆస్కార్ వరకు వెళ్ళింది. అయితే, ఆయన ఆశించినట్టు సుకుమార్ మాస్ సినిమా తీశారు. 'పుష్ప'తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. దానికి ముందు రామ్ చరణ్ 'రంగస్థలం'తో మాస్ అంటే ఏంటో చూపించారు. ఇప్పుడు 'పుష్ప 2' తీస్తున్నారు. దాని తర్వాత ప్రభాస్‌తో తెలంగాణ నేపథ్యంలో మూవీ తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా సక్సెస్ తర్వాత సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అబ్దుల్ ఫర్హాన్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల్లోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అబ్దుల్. సరైన సమయంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అబ్దుల్ ఆ సమయంలో స్పందించకపోయి ఉంటే మెగా హీరో ప్రాణాలతో ఉండేవారు కాదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అబ్దుల్‌కు మెగా ఫ్యామిలీ నుంచి సాయం అందిందనే ప్రంచారాన్ని అబ్దుల్ ఖండించాడు. సాయి ధరమ్ తేజ్ నుంచి తనకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని, సాయం అందలేదని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రాణాలు కాపాడిన అబ్దుల్ పర్హాన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సాయం అందలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. అబ్దుల్‌కు తాను సాయం చేశానని ఎక్కడా చెప్పలేదని, ఆయనకు ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే చెప్పానని స్పష్టత ఇచ్చాడు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో మొన్నటిదాకా ఆస్పత్రి బారిన పడి, ఈ మధ్యే కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు మరో వ్యాధి బారిన పడిందా? లేదంటే మునుపటి వ్యాధి తాలూకూ లక్షణాలే ఇంకా పోలేదా.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం.. ఆమె ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే. ఆ ఫొటో చూసి అభిమానులు.. సమంతకు మళ్లీ ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. అయ్యో మా సమంత మళ్లీ ఆరోగ్యం బాగా లేదా అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సామ్‌కు ఏమైంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్
Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత
NTR Centenary Awards : 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్'లో ఎఫ్‌టిపిసి ఎన్టీఆర్ అవార్డ్స్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!