Bigg Boss 5 Telugu : అమ్మలక్కలా మారిపోయిన రవి, బిగ్ బాస్ హౌజ్ లో విమెన్ ట్రాఫెకింగ్... మాధవీ లత షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో నిత్యం విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. కానీ ఇంతకుముందో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టున్నాయి మాధవీలత కామెంట్స్. షో గురించి ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కొన్ని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఎప్పుడూ బిగ్ బాస్ కు వ్యతిరేక ఉద్యమాన్ని సోషల్ మీడియా వేదికగా కొనసాగిస్తూ ఉంటారు. బిగ్ బాస్ అనేది మన సంస్కృతికి వ్యతిరేకం అంటూ హడావుడి చేస్తూనే ఉంటారు. అయితే బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్ కమ్ బీజేపీ నాయకురాలు మాధవీలత కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా హోస్ట్ నాగార్జునను ఏకిపడేసిన బ్యూటీ లేటెస్ట్ గా ఇంటి సభ్యుల ప్రవర్తనని అసహ్యించుకుంటూ పోస్టులు పెట్టింది.
కాజల్ ని నామినేట్ చేసిన రవి తిరిగి ఆమెను ఇన్ఫులెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని.. సన్నీ౦-మానస్ నుంచి దూరం చేసేందుకు తెగ ట్రై చేస్తున్నాడని ఇన్ స్టా స్టేటస్ లో పోస్ట్ పెట్టింది మాధవీలత. తన స్వార్థం కోసం అమ్మలక్క అవతారం ఎత్తాడని దుమ్మెత్తిపోసింది. ఇక సన్నీ ఏకంగా విమెన్ ట్రాఫెకింగ్ చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారయ్యో... అసలు విమెన్ ట్రాఫెకింగ్ అంటే తెలుసా అంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆడపిల్లని అమ్మేస్తా అనే ట్రోలింగ్ నడుస్తోందంది. ఇక అప్పడం పాప బానిసైపోయిందంటూ సిరి ని ఉద్దేశించి కూడా పోస్టులు పెట్టింది. తనకు రెక్కలున్నాయి కానీ హౌజ్ లో ఎగరకూడదు, ఎవ్వరితోనూ క్లోజ్ గా ఉండకూడదు, ముఖ్యంగా శ్రీరామ్ తో మాట్లాడకూడదు, నవ్వకూడదు... అందర్నీ అన్నా అనాలి. ఒక్కరితో తప్ప ఆల్ మెన్స్ అన్నయ్యలే అనాలి. అసలు నాకు ఇలాంటి ఆంక్షలు పెట్టే బెస్ట్ ఫ్రెండ్ ఉంటే పొడిచి పోలీస్ స్టేషన్ కి పోయేదాన్నంటూ పోస్ట్ పెట్టింది.
రెండు రోజుల క్రితం ఇదే విషయంపై స్పందించిన మాధవీలత... బిగ్ బాస్ ఇంట్లో అనాగరిక చర్య జరుగుతుందంటూ కామెంట్ పెట్టింది. బిగ్ బాస్ టీమ్, నాగార్జున లు ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తూ అత్యంత దారుణంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ పేర్కొంది. దీనిపై మానవ హక్కులు మరియు ప్రజా సంఘాల వారు ఎలాగూ స్పందించరు. నాగరిక సమాజంలో బతుకుతున్న మనం ఇలాంటి చర్యలను అస్సలు సహించవద్దంది. ఆమె చెబుతున్నది సన్నీని ఉద్దేశించే అన్నది నెటిజన్లకి క్లారిటీ వచ్చింది. ఏదేమైనా మాధవీలత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవరాల్ గా బిగ్ బాస్ హౌజ్ లో అలకలు, పలుకులు, కులుకులు, చిలకలు, వలపులు నడుస్తున్నాయని ఫుల్ ఫుటేజ్ అంటూ కామెంట్ చేసింది మాధవీలత. అయితే బిగ్ బాస్ షోపై ఇలాంటి కామెంట్స్ కామన్ అని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారట షో నిర్వాహకులు.
Also Read: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
Also Read: పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి