Allari Naresh: మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ - హిట్ కొడతాడా?
అల్లరి నరేష్ ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

టాలీవుడ్ లో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు. చాలా తక్కువ సమయంలో 50 సినిమాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు అల్లరి నరేష్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కట్టేవారు. ఆడియన్స్ కూడా అతడి సినిమాలు బాగా ఎంజాయ్ చేసేవారు. కానీ కొంతకాలంగా ఆయన కామెడీ వర్కవుట్ అవ్వడం లేదు. దీంతో ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.
ఈ విషయం గ్రహించిన అల్లరి నరేష్ తన రూటు మార్చుకున్నారు. విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతున్నారు. 'మహర్షి' సినిమాలో సీరియస్ రోల్ పోషించిన అల్లరి నరేష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలానే 'నాంది' సినిమాతో భారీ హిట్టు కొట్టారు. ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లే జాగ్రత్తగా సినిమాలను ఎన్నుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి 'సభకు నమస్కారం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశారు అల్లరి నరేష్. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాకి 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నరేష్ ఎలెక్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Also Read: ఆ బూతులేంటి? నటరాజ్ మాస్టర్ పై నాగార్జున ఫైర్
Also Read: రవితేజ కోసం సిద్ శ్రీరామ్ మ్యాజికల్ సాంగ్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

