Heropanti 2 Trailer: ‘హీరోపంతీ 2’ ట్రైలర్, ఇది మరీ అడల్ట్ ఫిల్మ్‌లా ఉందే!
టైగర్ ష్రాఫ్ నటించిన ‘హీరోపంతి 2’ ట్రైలర్ వచ్చేసింది. కానీ, ‘హీరోపంతి’ చిత్రాన్ని ఊహించుకుని ఈ ట్రైలర్ చూస్తే నిరాశ తప్పదు.
టైగర్ ష్రాఫ్, నవాజుద్దీన్ సిద్ధికీ ప్రధాన తారాగణంలో నటించిన ‘హీరోపంతి 2’ ట్రైలర్ గురువారం విడుదలైంది. గతంలో టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటించిన ‘హీరోపంతి’ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అది ‘పరుగు’ చిత్రానికి రీమేక్. ‘హీరోపంతీ’కి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘హీరోపంతి 2’కు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించాడు.
ఇక ట్రైలర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ‘ప్రపంచంలోని ప్రతి సైబర్ క్రైమ్ నేరం వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉంటుంది. అతడి పేరు లైలా’’ అంటూ నవాజుద్దీన్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలవుతుంది. ఒకరకమైన సైకో క్యారెక్టర్‌లో నవాజుద్దీన్‌ను క్రూరంగా చూపించే ప్రయత్నం చేశాడు. లైలా సైబర్ నేరాలకు జాదుగరైతే.. బబ్లూ ఆ జాదుగర్‌కు మంత్రం’’ అంటూ టైగర్‌ను పరిచయం చేశాడు. అక్కడి నుంచి రెండు మూడు అడల్ట్ కంటెంట్ డైలాగులు, సీన్లు, బీభత్సమైన పోరాట సన్నివేశాలతో ట్రైలర్ నడిచింది. చూస్తుంటే ఈ చిత్రం మాస్‌కు మాంచి కిక్ ఇస్తుందనిపిస్తోంది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘హీరోపంతీ 2’ నచ్చేస్తుందనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూసి మీ అభిప్రాయం కూడా చెప్పేయండి మరి. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!
View this post on Instagram