అన్వేషించండి

Gandhada Gudi Movie: పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ఇదే! ఎక్కడ? ఎలా చూడాలంటే?

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘గంధడ గుడి’. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలైంది. కానీ, లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించింది.

Puneeth Rajkumar's  Gandhada Gudi Movie: పునీత్ రాజ్ కుమార్. దివంగత కన్నడ సూపర్ స్టార్. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. 2021 అక్టోబరు 29న జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతితో యావత్ కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన అభిమానులు కంటతడి పెట్టారు.

పునీత్ చివరి సినిమాను ఎలా చూడాలంటే?

కాసేపు పునీత్ రాజ్ కుమార్ మృతి విషయాన్ని పక్కన పెడితే, ఆయన చివరగా నటించిన సినిమా గంధడ గుడి’. డాక్యుమెంటరీగా మూవీని చిత్రీకరించారు. అప్పట్లో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో విడుదలై ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యింది. అయితే, లైసెన్స్ గడుపు పూర్తి కావడంతో అమెజాన్ ఈ మూవీని తొలగించింది. అమెజాన్ నిర్ణయంతో పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అమెజాన్ ప్రైమ్ 'గంధడ గుడి’సినిమాను తన ఫ్లాట్ ఫామ్ నుంచి తీసేసినా, మరికొన్ని డిజిటల్  వేదికలపై అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ తో పాటు గూగుట్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీలో చూసే అవకాశం ఉంది. కానీ, డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఎవరైనా చూడాలి అనుకుంటే, రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. కర్ణాటక అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని చూపిస్తూ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇందులో పునీత్ రాజ్ కుమార్ నటించడమే కాకుండా ఆయనే స్వయంగా నిర్మించారు.   

జిమ్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన పునీత్ రాజ్ కుమార్

పునీత్‌ రాజ్‌కుమార్‌ 2021 అక్టోబరు 29న అకస్మాత్తుగా చనిపోయారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించినా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరి పేరు ధ్రితి, మరొకరి పేరు వందిత. ఆయన చనిపోయిన తర్వాత మైసూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఆయన సతీమణి ఈ పట్టాను అందుకున్నారు.   

కర్నాటక సర్కారు అరుదైన గౌరవం

దివంగత పునీత్ రాజ్ కుమార్ కు ఆనాటి కర్నాటక ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో కర్ణాటక ప్రభుత్వం శాటిలైట్లను తయారు చేసే ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ శాటిలైట్ ప్రాజెక్ట్ _KGS3Sat అనే ఈ ప్రాజెక్ట్ కింద తయారు చేసే ఉపగ్రహానికి 'శాటిలైట్ పునీత్' అని పేరు పెట్టింది. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత KGS3Sat కు అధికారికంగా పేరు మార్చిన కర్ణాటక ప్రభుత్వం...విద్యార్థుల ల్యాబ్ సౌకర్యాలు ఫెసిలిటీ కోసం బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రభుత్వ పాఠశాలను గ్రౌండ్ స్టేషన్ గా ఎంచుకుంది. ఈ స్టేషన్ కు కూడా పునీత్ శాటిలైట్ వర్క్ స్టేషన్ అనే పేరు పెట్టింది. అప్పటి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై దీన్ని ప్రారంభించారు.  

Read Also: మనసుకు హత్తుకుంటున్న అమ్మ పాట - ‘గుంటూరు కారం’ నుంచి ఆ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget