బ్రహ్మీ చాలా రిచ్ గురూ, ఈ ఇండియన్ కమెడియన్స్ ఆస్తుల్లో టాప్ బ్రహ్మానందమే!
సినిమాల్లో హీరోహీరోయిన్ పాత్రలు పోషించకపోయినా వారి పాత్రకున్న పాపులారిటీ, ప్రాధాన్యత ఇంకెవరికీ ఉండదు. వాళ్లే కమెడియన్స్. మూవీని చూసే వాళ్లకు చిన్న పాత్రే అనిపించినా వారి సంపాదన మాత్రం కోట్లలో ఉంటుంది.
Richest Comedians in India : ఏ సినీ పరిశ్రమ అయినా సరే నటీనటుల ఏకైక లక్ష్యం తెరపై తమ నటనతో ప్రజలను అలరించడం, విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం. అందులో చాలా మంది నటీనటులు హీరో, హీరోయిన్ల పాత్రలను ఎంచుకుంటే.. మరికొందరు కథకు కొత్త కోణాన్ని జోడించేందుకు విలన్‌లుగా మారతారు. కానీ కొంతమంది నటీనటులు మాత్రం తమ అద్భుతమైన కామిక్ సెన్స్‌తో ప్రేక్షకులను నవ్విస్తారు. సినిమాల్లో వీరి పాత్ర చిన్నదిగానే కనిపించినా.. వారు చేసే కామెడీ, పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాదు. ఈ హాస్యనటులలో కొందరు హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అత్యంత ధనవంతులైన హాస్యనటుల గురించే.. అది ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మానందం
సౌత్ ఇండస్ట్రీలో బ్రహ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ గురుగా పేరు పొందిన బ్రహ్మానందం సౌత్ సినిమాలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఎంతో పాపులారిటీ కలిగిన నటుడు. అభిమానులు అత్యంత ఆదరించే, ప్రేమించే బ్రహ్మానందం.. తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే బ్రహ్మానందం ఒక్కో సినిమాకు రూ.1 నుంచి 2 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అంతే కాదు అతని ఆస్తుల విలువ దాదాపు రూ.350 కోట్లు ఉండవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అలా చూస్తే ఇండియాలోనే అత్యంత రిచ్ కమెడియన్ మన బ్రహ్మీయే.
కపిల్ శర్మ
స్టాండ్-అప్ కామెడీతో కెరీర్‌ను ప్రారంభించిన నటుడు కపిల్ శర్మ.. నేడు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిస్ట్ లలో ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే కపిల్ శర్మ ఆస్తుల విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా.
జానీ లివర్
90వ దశకం నాటి అనేక చిత్రాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్.. ఇప్పటికీ ప్రజల్లో మంచి ఆదరణను కలిగి ఉన్నారు. జానీ లీవర్ ప్రస్తుత విలువ రూ. 225 కోట్లు ఉండొచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
పరేష్ రావల్
హిందీ సినిమాల్లో ప్రసిద్ధ, పలు పాత్రలు పోషించిన నటులలో ఒకరైన పరేష్ రావల్ నటుడు మాత్రమే కాదు, హాస్యనటుడు, రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త కూడా. తన అద్భుతమైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ నటుడు హిందీతో పాటు గుజరాతీ చిత్రాల్లోనూ నటించారు. హేరా ఫేరీ, ఫిర్ హేరా ఫేరీ లాంటి చిత్రాలలో తన కామెడీ రోల్ తో పాపులర్ అయ్యారు. కాగా పరేష్ రావల్ ప్రస్తుతం నికర ఆస్తుల విలువ రూ.93 కోట్లు.
రాజ్‌పాల్ యాదవ్
నటుడు రాజ్‌పాల్ యాదవ్ చుప్ చుప్ కే, భూల్ భులయ్యా, భూల్ భులయ్యా 2 వంటి అనేక చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. పలు నివేదికల ప్రకారం రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం రూ. 50 కోట్ల ఆస్తికి యజమాని.
Read Also : Varun Tej Lavanya Tripathi : అవును, లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు - త్వరలో పెళ్లి, రేపే ఎంగేజ్మెంట్