Shruti Haasan: శ్రుతీ హాసన్ చేతి మీద మూడు గాట్లు, ఒక్కో గాటుకీ ఒక్కో కథ!
శ్రుతీ హాసన్ చేతి మీద మూడు గాట్లు ఉన్నాయి. ఒక్కో గాటుకీ ఒక్కో కథ ఉందని ఆమె చెబుతున్నారు. ఆ కథలేంటి?
తాహిర్ వజీర్ అంత గొప్ప రచయిత కావాలనేది తన లక్ష్యమని కథానాయిక శ్రుతీ హాసన్ చెబుతున్నారు. అది నిజ జీవితంలో కాదు లెండి... వెబ్ సిరీస్‌లో! ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన అమెజాన్ ఒరిజినల్ సిరీస్ 'బెస్ట్ సెల్లర్'. మరి, తాహిర్ వజీర్ ఎవరు? అంటే... అర్జున్ బజ్వా. 'బెస్ట్ సెల్లర్' సిరీస్‌లో పేరు మోసిన నవలా రచయిత తాహిర్ వజీర్ పాత్రలో ఆయన నటించారు. 'ఓ రోజు నేను కూడా తాహిర్ వజీర్ అవుతాను' అంటోంది ఒక అమ్మాయి. ఆమె శ్రుతీ హాసన్.
కాఫీ షాపులో పని చేసే శ్రుతీ హాసన్‌కు ఒక రోజు తాహిర్ వజీర్ తమ షాపులో కనిపిస్తాడు. అతడితో మాట్లాడుతుంది. ఆమె చేతి మీద మూడు గాట్లు ఉంటాయి. అవి అతడిని ఆకర్షిస్తాయి. ఒక్కో గాటుకి ఒక్కో కథ ఉంటుందని చెబుతుంది. మొదటి గాటుకి కారణం చిన్నతనంలో తండ్రి చెయ్యి చేసుకోవడం అని చెబుతుంది. రెండో గాటుకి కారణం హత్య అంటుంది. మరి, మూడో గాటుకి? అంటే... ఆ కథ ఇప్పుడే రాస్తున్నాని చెబుతుంది. ఆ గాట్ల స్ఫూర్తితో అతడు పుస్తకాలు రాయడం మొదలు పెడతాడు. అయితే... అనూహ్యంగా శ్రుతీ హాసన్ మీద ఎటాక్ జరుగుతుంది? ఆ ఎటాక్ చేసింది ఎవరు? తాహిర్ వజీర్ ఇంత గొప్ప రచయిత కావడం వెనుక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మీడియా ఎందుకు కథనాలు ప్రసారం చేస్తోంది? అంటే... ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానున్న 'బెస్ట్ సెల్లర్' సిరీస్ చూడాలి. అదీ సంగతి!
ఇటీవల విడుదలైన 'బెస్ట్ సెల్లర్' ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రుతీ హాసన్, అర్జున్ బజ్వాతో పాటు మిథున్ చక్రవర్తి, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనాలీ కులకర్ణి తదితరులు నటించారు.
View this post on Instagram