The Warrior Movie: రామ్ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ఎంతంటే?
'ది వారియర్' శాటిలైట్-డిజిటైల్ రైట్స్ ను డిస్నీ గ్రూప్ దక్కించుకుందట. శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానెల్ కు, స్ట్రీమింగ్ రైట్స్ హాట్ స్టార్ ఓటీటీకి దక్కాయి.
యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈరోజు సినిమాలో విలన్ గా నటిస్తోన్న ఆది పినిశెట్టి లుక్ ను రివీల్ చేశారు. లింగు స్వామీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ రైట్స్ ను భారీ ధరకు అమ్మేశారు.
తాజాగా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయిందని సమాచారం. 'ది వారియర్' శాటిలైట్-డిజిటైల్ రైట్స్ ను డిస్నీ గ్రూప్ దక్కించుకుందట. శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానెల్ కు, స్ట్రీమింగ్ రైట్స్ హాట్ స్టార్ ఓటీటీకి దక్కాయి. ఈ మొత్తం డీల్ రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు రామ్ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ అని తెలుస్తోంది.
నిజానికి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తరువాత రామ్ నుంచి మరో హిట్టు సినిమా రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'రెడ్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత గ్యాప్ తీసుకొని 'ది వారియర్'కి ఓకే చెప్పారు రామ్. ఇప్పుడు ఈ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండడం విశేషం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
ఇందులో రామ్ కి జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్. ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా.. మరొక గెటప్ ను సస్పెన్స్ గా ఉంచారు. ఈ సినిమా పూర్తయ్యాక బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు రామ్.
View this post on Instagram