అన్వేషించండి

VD 14 Movie: నిన్న మైక్ టైసన్, నేడు ‘ది మమ్మీ’ విలన్ - తగ్గేదే లేదంటున్న విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD14 మూవీకి సంబంధించి ఓ కేజ్రీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ‘ది మమ్మీ’ విలన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

The Mummy Villain In Vijay Deverakondas Movie : గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ముచ్చటగా మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు మూడు  భిన్నమైన జోనర్లలో ప్రేక్షకుల ముందుకురానున్నాయి. నానితో ‘జెర్సీ’ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి VD12 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఓ స్పైలా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ తో కలిసి ‘ట్యాక్సీవాలా’ సినిమా చేసిన రాహుల్ సంకృత్యాన్ మరో సినిమా కూడా చేస్తున్నారు. విజయ్ కెరీర్ లో 14వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘ఇతిహాసాలను ఎవరూ రాయరు.. అవి హీరోల రక్తంతో చెక్కబడతాయి’ అంటూ షేర్ చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచింది. మరోవైపు  రవి కిరణ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ VD15 అనే సినిమా చేస్తున్నారు.  

VD14లో ‘ది మమ్మీ’ విలన్

విజయ్ దేవరకొండ,  రాహుల్ సంకృత్యాన్ కాంబోలో వస్తున్న ‘VD 14’ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్నాల్డ్  ‘ది మమ్మీ’ (1999), ‘ది మమ్మీ రిటర్న్స్’ (2001) లాంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ‘VD14’ చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం వోస్లూతో చర్చలు జరుపుతున్నాట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.     

హాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూ  

ఆర్నాల్డ్ వోస్లూ హాలీవుడ్ లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌతాఫ్రికాకు చెందిన ఆయన ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్‌’ చిత్రాలతో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు. ‘ఏజెంట్ కోడి బ్యాంక్స్’ (2003), ‘బ్లడ్ డైమండ్’ (2006), ‘సిల్వర్టన్ సీజ్’ (2022), ‘G.I’ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గత దశాబ్దానికి పైగా హాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.  అమెరికన్ బుల్లితెరపైనా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ‘24’, ‘NCIS’, ‘చక్’, ‘బోన్స్’, ‘ఎలిమెంటరీ’, ‘బాష్, ది బ్లాక్‌ లిస్ట్’ లాంటి షోలలో నటించారు. ఇప్పుడు ఆయన తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.   

‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు తన సినిమాలో మరో హాలీవుడ్ నటుడు కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 ప్రారంభంలో షూటింగ్ మొదలనున్నట్లు తెలుస్తోంది.   

Read Also: ఆ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది, అసలు విషయం చెప్పేసిన హన్సిక

టాప్ హెడ్ లైన్స్

Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget