(Source: ECI/ABP News/ABP Majha)
The Life Of Muthu New Release Date : తెలుగులో రెండు రోజులు ఆలస్యంగా శింబు, గౌతమ్ మీనన్ సినిమా
The Life of Muthu Postponed : శింబు, గౌతమ్ మీనన్ కలయికలో రూపొందిన తాజా సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' విడుదల వాయిదా పడింది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
శింబు (Simbu) కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life of Muthu Telugu Movie). తొలుత గురువారం (సెప్టెంబర్ 15న) విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఇప్పుడు విడుదల తేదీ మారింది. ఈ సినిమా రెండు రోజుల ఆలస్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తమిళ సినిమా 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) కు తెలుగు అనువాదమే 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'. శింబు, గౌతమ్ మీనన్ కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. ఇంతకు ముందు 'ఏ మాయ చేసావె', 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ్ వెర్షన్స్ చేశారు. ఆ రెండూ రొమాంటిక్ ఫిల్మ్స్ అయితే... 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' యాక్షన్ సినిమా. తమిళంలో ముందుగా ప్రకటించినట్లు సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. టెక్నికల్ రీజన్స్ వల్ల తెలుగులో శనివారం (సెప్టెంబర్ 17న - The Life of Muthu Telugu Movie New Release Date) విడుదల చేయాలని నిర్ణయించారు.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ స్రవంతి మూవీస్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తోంది. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు : ది కిల్లింగ్స్'గా విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఏఆర్ రెహమాన్ పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
'స్రవంతి' మూవీస్ అధినేత రవి కిశోర్ (Sravanthi Ravi Kishore) ఈ సినిమా గురించి మాట్లాడుతూ ''ఆల్రెడీ తెలుగు టీజర్ విడుదల చేశాం. దానికి మంచి స్పందన లభిస్తోంది. గతంలో 'స్రవంతి' సంస్థలో 'నాయకుడు' , 'పుష్పక విమానం' , ' రెండు తోకల పిట్ట', రఘువరన్ బీటెక్' చిత్రాలు అనువదించి విడుదల చేశాం. అవి సంచలన విజయాలు సాధించాయి. ఆ జాబితాలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కూడా చేరుతుందని ఆశిస్తున్నాం. శింబు నటన గురించి, దర్శకుడు గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళందరి బెస్ట్ వర్క్ ఈ సినిమా. సెప్టెంబర్ 17న తెలుగులో విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అని తెలిపారు.
Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!
శింబు సరసన సిద్ధీ ఇద్నాని (Siddhi Idnani) కథానాయికగా నటించిన ఈ సినిమాలో హీరో తల్లి పాత్రను రాధికా శరత్ కుమార్ చేశారు. ఈ చిత్రానికి కథ: బి. జయమోహన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: సిద్ధార్థ నూని, ఎడిటింగ్: ఆంథోనీ, పాటలు: అనంత్ శ్రీరామ్, కృష్ణ కాంత్, గానం: శ్రేయా ఘోషల్, చిన్మయి శ్రీపాద.