The Kerala Story Teaser: 'ది కశ్మీరి ఫైల్స్' బాటలో 'ది కేరళ స్టోరీ' - 32 వేల మంది హిందూ అమ్మాయిల కిడ్నాప్!
గత పన్నెండేళ్లలో కేరళ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ కి గురవుతున్నారు. దాదాపు 32వేల మంది యువతులు కిడ్నాప్ అయినట్లుగా సమాచారం. ఇదే కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నారు.
ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని దర్శకనిర్మాతలు తెలియజేయడంతో ఈ చిత్రానికి ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది.
ఈ సినిమా చూసి చాలా మంది చలించిపోయారు. కొన్ని రాష్ట్రాలైతే ఏకంగా ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా బాటలోనే మరో కథను కూడా తెరపై చూపించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అదే 'ది కేరళ స్టోరీ'. గత పన్నెండేళ్లలో కేరళ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్‌కు గురయ్యారని, దాదాపు 32వేల మంది యువతులను అపహరించారని పేర్కొంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
‘‘ఓ మతానికి చెందిన వ్యక్తులు ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను వలలో వేసుకొని, ఆ తరువాత వారి మతం మార్చేసి కేరళ నుంచి ముస్లిం వార్ జోన్స్.. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు’’ అని పేర్కొంటూ ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా సినిమా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
View this post on Instagram