News
News
వీడియోలు ఆటలు
X

The Kerala Story row: ఆ ఆరోపణలను రుజువు చేస్తే రూ. కోటి ఇస్తాం, ‘ది కేరళ స్టోరీ’ మేకర్స్ కు ముస్లిం యూత్ లీగ్ ఆఫర్!

తప్పిపోయిన అమ్మాయిల కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ మూవీపై కేరళలో పెను వివాదం చెలరేగుతోంది. ట్రైలర్ లో చూపించిన విషయాలను రుజువు చేయాలంటూ ముస్లిం యూత్ లీగ్ డిమాండ్ చేసింది.

FOLLOW US: 
Share:

కేరళలో మిస్సైన అమ్మాయిల ఇతివృత్తంతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 5న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.  మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఈ సినిమా ఉందంటూ ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  పినరయి విజయ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలను విడుదల చేయకూడదంటూ అధికార, పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆరోపణలు నిరూపిస్తే కోటి రూపాయలు అందిస్తాం!

తాజాగా ఈ సినిమాపై ఆ కేరళ ముస్లిం యూత్ లీగ్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమా టీజర్ లో చూపించినట్లు కేరళకు చెందిన 32,000 మంది అమ్మాయిలను  బలవంతంగా మతమార్పిడి చేసి, ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేర్చుకున్నారని ఎవరైనా రుజువు చేస్తే భారీగా నగదు బహుమతి అందిస్తామని ఆఫర్ చేసింది. సినిమా నిర్మాతలు, దర్శకుడు ఈ విషయాన్ని రుజువు చేయాలని ముస్లిం యూత్ లీగ్ డిమాండ్ చేసింది.  టీజర్‌లో పేర్కొన్నట్లు  కేరళకు చెందిన యువతులు ఇస్లాం మతంలోకి మారి సిరియా, యెమెన్‌కు తరలించబడినట్లు రుజువు చేస్తే మేకర్స్ కు రూ. 1 కోటి నగదు బహుమతిని ఇస్తామని వెల్లడించింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunshine Pictures Pvt Ltd (@sunshinepicturesofficial)

సినిమా కథ ఏంటంటే?

డైరెక్టర్ సుదీప్తోసేన్‌ ‘ది కేరళ స్టోరీ’ రూపొందించారు. కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. తప్పిపోయిన అమ్మాయిలు, మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమాను నిషేధించాలంటున్న అధికార, విపక్షాలు   

‘ది కేరళ స్టోరీ’ సినిమాను రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధించాలని అక్కడి అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమా ట్రైలర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతపరమైన  ద్వేషాన్ని సృష్టించేందుకు ఈ సినిమాను తీసినట్లు అర్థం అవుతుందని ఆరోపించారు . రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాయని,  వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలను  విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.  సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది.  క్రిస్టియన్‌ అసోసియేషన్‌(సీఏఎస్‌ఏ), బీజేపీ లాంటి పార్టీలో ఈ సినిమా విడుదలకు సోప్టు చేస్తున్నాయి.   ‘లవ్‌ జిహాద్‌’తో నాశనం అయిన ఎన్నో కేరళ కుటుంబాల కథే ఈ సినిమా అని సీఏఎస్‌ఏ అభిప్రాయపడింది.

ఏడేళ్లు రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశాం- డైరెక్టర్ సుదీప్తో సేన్

ఈ సినిమా తీయడానికి చాలా రీసెర్చ్ చేసినట్లు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెలిపారు. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డట్టు వివరించారు. “అమ్మాయిల మిస్సింగ్ కథ విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నాను. కానీ, రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దీని గురించి అంతా తెలుసుకున్నాకే సినిమా తీశాను” అని తెలిపారు.  

Read Also: తెలుగు సినిమా సత్తా - ‘సీతారామం’, ‘బలగం’ సినిమాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు

Published at : 02 May 2023 10:22 AM (IST) Tags: Adah Sharma Sudipto Sen The Kerala Story The Kerala Story row Muslim Youth League

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి