News
News
X

Bigg Boss 6 Telugu: నామినేషన్లలో వేడి మామూలుగా లేదు, ఫైర్ ఈజ్ ఆన్, కొత్త ప్రోమోపై లుక్కేయండి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కొత్త ప్రోమో వచ్చేసింది. ఆ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ మామూలుగా ఉండదని అర్థమైపోతోంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: రెండో వారం నామినేషన్లు ఇవి. కానీ ఆ వేడి చూస్తుంటే చివరి వారానికి చేరుకున్నంత ఫైర్ కనిపిస్తోంది. సీజన్ 6లో తొలివారంతోనే గొడవలు మొదలైపోయాయి. అందుకేనేమో ప్రేక్షకులు ఈ షోకు త్వరగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పటికే సోమవారం నామినేషన్లకు సంబంధించి ఒక ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్. ఇంకా అది మర్చిపోక ముందే మరొక వాడి వేడి ప్రోమో వచ్చేసింది. ఇందులో కూడా గీతూనే ఎక్కువ మంది నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆమెతోనే ఇద్దరూ ముగ్గురూ వాదిస్తూ కనిపించారు. 

ఎలా మాట్లాడదాం?
రేవంత్ - గీతూ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రేవంత్ మాట్లాడుతూ ‘మెల్లగా మాట్లాడుదామా? గట్టిగా మాట్లాడుదామా?’ అని అడిగాడు. దానికి గీతూ ‘ఎట్టయినా మాట్లాడు అది నీ ఇష్టం, నువ్వెట్టా మాట్లాడాలో నేనేం చెప్పేది’ అని తన స్టైల్లోనే స్పందించింది. తరువాత చంటి మాట్లాడుతూ ‘గీతూకి ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి ఆమెకేదైనా మంచి చెబుదాం దగ్గరికెళ్లి అనుకునేవారి వరకు... అందరూ ఆమెతో ఏదైనా మాట్లాడితే అది కూడా కాంపిటీషన్ అనుకుంటుందేమో అని ఎందుకెళ్లి చెప్పడం అనుకుంటున్నారు’ అని అన్నాడు. దానికి గీతూ ఓ ముద్దు విసిరింది. దానికి చంటి తలగోక్కున్నాడు. బాలాదిత్య ఎవరి గురించో చెప్పాడో చూపించలేదు కానీ ‘గెలవడం కచ్చితంగా ముఖ్యం, కానీ ఎలా గెలిచామన్నది కూడా చాలా ముఖ్యం’ అని అన్నాడు. వెంటనే రేవంత్ తెరపైకి వచ్చి ‘మీకు లేవేమో ఎథిక్స్, నాకున్నాయి’ అనగానే, గీతూ ‘గుడ్’ అంది. దానికి రేవంత్ ‘ఎక్స్ ట్రాలు వద్దు’ అనగానే, గీతూ ‘నేను ఎక్స్ ట్రాలే మాట్లాడుతా’ అంది. రేవంత్‌ను ఉద్దేశించి బాలాదిత్య ‘ఆవేశం మంచిది కాదు’ అని హితవు చెప్పాడు. 

షానీ నటిస్తున్నాడా?
శ్రీ సత్య షానీని నామినేట్ చేస్తూ కనిపించింది. నాకు మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారనిపిస్తుంది అంది. బాలాదిత్య కూడా మంచితనం నటన అనుకునే పరిస్థితి వస్తుంది అని షానీని ఉద్దేశించి అన్నాడు. షానీ తనను విసిగిసంచమని, సతాయించమని, కోపం వస్తే కోప్పడతానని చెప్పాడు. దానికి అందరూ నవ్వేశారు. ఇక ఇనయా ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఆది రెడ్డి ఈ ఇంట్లో ఉన్నప్పుడు 15 వారాల పాటూ ప్రతిరోజూ నామినేట్ అయిన అస్సలు కేర్ చేయడను అంటూ సమాధానం ఇచ్చాడు ఆది రెడ్డి. 

వచ్చిన సమాచారం ప్రకారం ఈసారి నామినేషన్లలో ఉన్నది వీరేనని తెలుస్తోంది. 
1. రేవంత్
2. మెరీనా - రోహిత్ జంట
3. షానీ
4. ఫైమా
5. అభినయా
6. గీతూ
7. రాజశేఖర్
8. ఆదిరెడ్డి

Also read: నామినేషన్ డే - రెండో వారమే వేడెక్కిన వాతావరణం, ఏం ఇరగదీశావ్ అంటూ ఆరోహిపై ఆదిరెడ్డి ఫైర్

Also read: ఈ వారం 'నో' ఎలిమినేషన్ - మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!

Also read: గీతూని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగ్ - ఏడుగురిలో వారిద్దరూ సేఫ్!

Published at : 12 Sep 2022 05:00 PM (IST) Tags: Bigg Boss6 Telugu Galatta Geethu Bigg Boss6 Telugu Daily Updates Revanth Bigg boss

సంబంధిత కథనాలు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?