Samantha: సమంత 'యశోద' కోసం 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ - నెక్స్ట్ లెవెలే!
సమంత 'యశోద' సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నారయత్. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నారయత్. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లను దిగుమతి చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి!
ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో సినిమాలు చేయబోతుంది సమంత. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇది కాకుండా.. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఆమె లిస్ట్ లో ఉంది.
View this post on Instagram