Jason Sanjay: దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు - లైకా ప్రొడక్షన్స్‌తో మొదటి సినిమా ప్రకటన!
తమిళ సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రవేశించనున్నాడు.
తమిళ టాప్ హీరో దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? టెక్నికల్ క్రూ సంగతేంటి? అనే విషయాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలో వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రానున్నాయి.
కొడుకు సినిమా ఎంట్రీ గురించి విజయ్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. తనను నటుడిగా పరిచయం చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ‘ఉప్పెన’ సినిమాను తమిళంలో జేసన్ సంజయ్‌తో రీమేక్ చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో పాటు మలయాళ ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ కూడా జేసన్ సంజయ్‌కు ఒక కథ చెప్పారట. కానీ ఈ ప్రతిపాదనను కొడుకు సున్నితంగా తిరస్కరించాడని విజయ్ ‘బీస్ట్’ సినిమా సందర్భంగా దర్శకుడు నెల్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో డైరెక్షన్‌కు సంబంధించిన కోర్స్ కూడా సంజయ్ చేశాడు. నటుడిగా ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా దర్శకత్వం వైపు జేసన్ సంజయ్ మళ్లాడు. ఇలా సినిమా ప్రకటించగానే తండ్రితో సినిమా ఎప్పుడంటూ ఫ్యాన్స్ అడగటం ప్రారంభించారు.
ఇక విజయ్ కూడా ప్రస్తుతానికి ‘లియో’ సినిమా పూర్తి చేసి తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాట ఎన్నో అంచనాలు ఉన్న సినిమా ఇదే. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘లియో’లో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
2023 జనవరిలో ‘లియో’ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫిబ్రవరి నుంచి అందించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టును దర్శకుడు లోకేష్ కనగరాజ్ పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు రేటుతో క్లోజ్ అయింది. థియేటర్ మీద రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను ‘లియో’ సాధించగలదని అంచనా. పాజిటివ్ టాక్ వస్తే 2.0 రికార్డును (రూ.810 కోట్లు) ‘లియో’ బ్రేక్ చేస్తుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘లియో’ విడుదల కానుంది.
We are beyond excited 🤩 & proud 😌 to introduce #JasonSanjay in his Directorial Debut 🎬 We wish him a career filled with success & contentment 🤗 carrying forward the legacy! 🌟#LycaProductionsNext #JasonSanjayDirectorialDebut @SureshChandraa @DoneChannel1 @gkmtamilkumaran… pic.twitter.com/wkqGRMgriN
— Lyca Productions (@LycaProductions) August 28, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial