By: ABP Desam | Updated at : 10 Apr 2023 12:44 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Ravi Teja/Instagram
ప్రస్తుతం సినిమా థియేటర్లకు గడ్డుకాలం ప్రారంభం అయిందనే చెప్పాలి. ఎందుకంటే అసలే ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ వంతు వచ్చింది. మార్చి 31 న ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. దీంతో పబ్లిక్ అంతా టీవీలకు అతుక్కుపోయారు. మన దేశంలో క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఐపీఎల్ లాంటి మ్యాచ్ లకు మంచి ఆదరణ ఉంది. దీంతో ఇప్పుడు ఈ ప్రబావం సినిమాల మీద పడింది. ఫలితంగా సినిమా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ఐపీఎల్ కు ముందు ఎంతో కొంత వసూళ్లు రాబడుతున్న సినిమాలు ఐపీఎల్ ఎఫెక్ట్ తో డీలా పడుతున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటించిన సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిచింది. పరీక్షల సీజన్లో ఈ మూవీని రిలీజ్ చేయడమంటే సాహసమే. అయినా సరే, మార్చి 30న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అయితే తర్వాత నుంచి కాస్త కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. ఇక ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో మూవీ క్రేజ్ తగ్గింది. తాజాగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో ప్రస్తుతం వస్తోన్న వసూళ్లపై ప్రభావం పడింది. ఇక రవితేజ ‘రావణాసుర’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తో నెమ్మదిగా వసూళ్లు రాబడుతోన్న ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం మూలిగే నక్క మీద తాటిపండు అన్న చందంగా మారింది. దీంతో ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
సాధారణంగా వీకెండ్ లోనే ఎక్కువ సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఆ వీకెండ్ రోజుల్లో వచ్చే టాక్ ను బట్టే సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్ ప్రభావం కొత్త సినిమాల వసూళ్ల పై పడుతుంది. పైగా మధ్యాహ్నం నుంచి మొదలయ్యే షోల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు విడుదల చేస్తు వాటికి ఆదరణ ఎలా ఉంటుందనే డైలమాలో పడ్డారు మేకర్స్. ఈ ఐపీఎల్ ఇంకొన్ని రోజులు కొనసాగనుంది. ఈ గ్యాప్ లో తెలుగులో సమంత నటించిన ‘శాకుంతలం’, అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ‘శాకుంతలం’ సినిమా దర్శకుడు గుణశేఖర్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం, అలాగే ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు కూడా ఈ సినిమాపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రభావం ఈ సినిమాలపై ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్ గా, సింగిల్ క్యారెక్టర్ తో సినిమా
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ
Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో
Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?
NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ మాళవిక లేటెస్ట్ ఫొటోస్
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి